పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రంజనీవృత్తము.

కామధేనుశిబికల్పభూమిరుహకంజబాంధవతనూజచిం
తామణిప్రతిమదానశోభిత నితంబినీజనమనోజ సం
గ్రామపార్థ బలగర్వితారిపురకాలకంధర మహాకవి
స్తోమసన్నుతవచోవికాస రణశూర బంధురపరాక్రమా.[1]

350


గద్యము.

ఇది శ్రీమదమరనార్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ వెన్నెల
కంటిసూరయనామధేయప్రణీతం బైనయాదిమహాపురాణం బగుబ్రహ్మాండంబు
నందలిపరాశరసంహిత యైనశ్రీవిష్ణుపురాణంబునందుఁ జతుర్దశమన్వంతరప్రకా
రంబును వేదవేదశాఖావర్ణనంబులును యాజ్ఞవల్క్యచరిత్రంబును సకలపురాణ
విద్యాకీర్తనంబును యమకింకరసంవాదంబును బ్రాహణాదివర్ణధర్మంబులును
బ్రహ్మచర్యాదిచతురాశ్రమక్రమంబులును ఆచారవర్తనంబులును పాషండో
పాఖ్యానంబును శతధన్వచరిత్రంబు నన్నది చతుర్థాశ్వాసము.


———

  1. కంజబాంధవతనూజ = సూర్యునికొడుకైన కర్ణుని, ప్రతిమ = పోలిన, దానశోభిత = ఈవిచేత ప్రకాశించువాఁడా, నితంబినీజనమనోజ = స్త్రీలకు మన్మథుఁడా, సంగ్రామపార్థ = యుద్ధమునందు అర్జునుఁడా, బలగర్వితారిపురకాలకంధర = బలముచేత గర్వించిన శత్రువుల పట్టణములకు శివుఁడా, మహాకవిస్తోమసన్నుతవచోవికాస = గొప్పకవులసమూహములచేత కొనియాడఁబడిన మాటలయొక్క వికాసము గలవాఁడా, రణశూర = యుద్ధమునందు శూరుఁడా, బంధురపరాక్రమా = మిక్కుటమైన పరాక్రమము కలవాఁడా.