పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్రోవ లెఱుంగఁగోరిన వినుం డధమాధమవైదికక్రియల్
పోవిడువుండు మామతముఁ బొందుఁడు పొందుఁడు ముక్తికామినిన్.[1]

313


వ.

అని యనేకవిధంబుల వేదనిందాసమర్థంబు లైననాస్తికశాస్త్రంబులు ప్రసంగిం
చిన నాదైతేయులు మాయామోహవాక్యంబులకుం జొక్కి పూర్వపరిచితంబు
లైన వేదంబులు విడిచి దురాచారులై జైనచార్వాకబౌద్ధమతంబులు గైకొని
పాషండవరు లై యందఱు వేదతంత్రంబు లైనయజ్ఞంబుల నిందసేయుచు
వైదికకర్మబాహ్యు లైరి మఱియును.[2]

314


క.

అరుణాంబరధరుఁడై య, ప్పురుషుఁడు వెండియును దనుజపుంగవుల నిరం
తరవేదమార్గరతులన్, నిరతము దుర్మార్గవృత్తి నెగడం జేసెన్.[3]

315


వ.

అంత నొక్కనాఁడు దనుజపరివృతుం డైనయప్పురుషుండు యజ్ఞంబు సేయు
చున్న సోమయాజులపాలికిం బోయి యిట్లనియె.

316


ఆ.

జీవహింస గోరి చేసినపాతకం, బనుచు శ్రుతులు చెప్పునట్టిమీరు
జీవహింస లిపుడు సేయుచు నున్నారు, కరుణలేక దుష్టకర్ము లగుచు.

317


క.

పేర్మి సహింసా పరమో, ధర్మ యనెడితొంటిపలుకుఁ దలఁపుచు నేత
త్కర్మములు విడిచి తద్దయు, నిర్మల మగుమామతమున నిలువుఁడు గరిమన్.[4]

318


తే.

ఆహుతులు వేల్వఁగా సవనాగ్నిచేత, దేవతాజ్యేష్ఠశక్రాదిదివిజులకును
దృప్తి యగు నను చెనఁటివైదికుల నమ్మి, యేల చెడిపోయెదరు మోక్ష మెఱుఁగలేక.[5]

319


తే.

దేవపితృకార్యములకు నై ద్విజుల కన్న, మిడినవారికిఁ బరితుష్టి యెట్లు కలుగు
సొరిది ఘటముల నన్నంబుఁ జూచి తృప్తి, నొందుదురయేని మఱి యిదియును నిజంబు.

320


ఉ.

కల్లలు వేదముల్ స్మృతులు గల్లలు కల్లలు యజ్ఞకర్మముల్
కల్లలు పైతృకక్రియలు కల్లలు ఘోరతపఃప్రభావముల్
కల్లలు దేవకార్యములు గావున బైజలు మాని మామతం
బెల్లవిధంబులన్ నడుపుఁ డిమ్ముల ముక్తికిఁ బోవఁ గోరినన్.[6]

321


వ.

అని యనేకప్రకారంబులు బోధించి శ్రౌతస్మార్తబహిష్కృతులం జేసి శుద్ధపాషండ
కర్మంబులకు నూలుకొల్పిన దైత్యదానవలోకంబు లమ్మహాపాతకంబునం జేసి తేజో

  1. కల్లలు = అసత్యములు, తథ్యము = సత్యము.
  2. సమర్థములు = చాలినవి, నాస్తికశాస్త్రంబులు= దేవుఁడు లేఁడనుటను స్థిరపఱచునట్టి శాస్త్రములు, పూర్వపరిచితంబులు = మునుపు అభ్యసింపఁబడినవి.
  3. నెగడన్ = అతిశయింప.
  4. పేర్మిన్ = గౌరవముతో.
  5. దేవతాజ్యేష్ఠశక్రాది = బ్రహ్మ యింద్రుఁడు మొదలైన, చెనఁటి =కుత్సితము.
  6. బైజలు = అజ్ఞానములు.