పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నానికురుంబుఁడై కదలి నాకము సర్వముఁ గొల్లలాడి దు
ర్మానమదప్రతాపమహిమల్ విలసిల్లఁగ యజ్ఞభాగముల్
తానె హరింపఁజొచ్చె సురలన్ నిరసించుచు దుండగంబునన్.[1]

293


శా.

దేవా దేవరయందు ము న్నుదయమై దేవాంతకశ్రేణియున్
దేవవ్రాతము దత్తదుక్తవిధులన్ దీపించునట్లయ్యు ల
క్ష్మీవక్షస్స్థల యజ్ఞభాగముల శేషీభూతముల్ గాఁగ మా
కీ వర్థిం గృపసేసినాఁడ వవి మా కీరానిశాటావలుల్.[2]

294


క.

వేదములును శాస్త్రములును, వేదాంగములున్ బఠించి వివిధక్రతువుల్
మోదమునఁ జేయుచున్నా, రాదనుజులు బెరుకు లేనియాచారములన్.[3]

295


ఉ.

కావున వేదమార్గములు గైకొని యజ్ఞము లాచరించుదై
త్యావలితోడ మార్కొని జయంబు గొనంగ నశక్తులైన యీ
దేవతలన్ గృపాకలితదృష్టిఁ గనుంగొని తద్వినాశకే
లీవిధ మాచరింపుము నిలింపశుభార్జిత పాపవర్జితా.[4]

296


క.

అని విన్నపంబు చేసిన, దనుజకులాంతకుఁడు దేవతావర్గములున్
ఘనతరకరుణారసలో, చనములు వికసిల్లఁ బల్కె సదయుండగుచున్.

297


క.

దైతేయులు మీ చెప్పిన, భాతిని నిజవర్ణధర్మపరిచితుమతులై
శ్రౌతస్మార్తక్రియలం, దాతురులై యున్నవార లమరులకంటెన్.[5]

298


తే.

వేదవేదాంగమార్గముల్ విడువ కెవ్వఁ, డేని నిజవర్ణధర్మభూయిష్ఠుఁ డగుచు
నుండు నావీర్యవంతుని నోర్వ నెట్టి, వారుఁ జాలరు కడునిక్కువంబు వినుఁడు.[6]

299


క.

ఆదనుజదైత్యవీరుల, వేదబహిష్కృతులఁ జేసి వీర్యము బలమున్
భేదించి విజయమును సం, పాదించెద మీకు నెల్లభంగుల ననుచున్.[7]

300

మాయామోహుండు తనమాయోక్తులచే నసురుల వేదబాహ్యులుగాఁ జేయుట

క.

తనమూర్తియందు నొకపురు, షుని మాయామోహుఁ డనఁగ సురుచిరతేజో

  1. నికురుంబుఁడు = సమూహము గలవాఁడు, కదలి = వెడలి - బయలుదేఱి, కొల్లలాడి = కొల్లపెట్టి, దుర్మానమదప్రతాపమహిమలు = చెడ్డగర్వము క్రొవ్వు పరాక్రమము వీనియొక్క ఆధిక్యములు,
    నిరసించుచున్ = తిరస్కరించుచు, దుండగంబునన్ = చెడ్డతనముతో.
  2. దేవాంతకశ్రేణి = రాక్షసులబారు, వ్రాతము = సమూహము, తత్తదుక్తవిధులన్ = వారివారికి చెప్పఁబడిన క్రమములతో, అశేషీభూతముల్ గాఁగన్ = మిగులు లేనివిగా - సర్వమును.
  3. బెరుకు = సంకోచము.
  4. తద్వినాశకేలీవిధము = వారిని నాశము చేయుట యనెడు ఆటరీతిని - వారిని చంపుటను, నిలింపసుఖార్జిత = దేవతలకొఱకు సంపాదింపఁబడిన సుఖముకలవాఁడా, పాపవర్జిత = పాపములచేత విడువఁబడినవాఁడా.
  5. భాతి = విధము, నిజవర్ణధర్మపరిచితమతులు = తమకులాచారమునందు వాడుక చేయఁబడినబుద్ధిగలవారు, శ్రౌత = వేదమునందు చెప్పఁబడిన, స్మార్త = స్మృతులయందు చెప్పఁబడిన, ఆతురులు = ఆసక్తులు.
  6. నిజవర్ణధర్మభూయిష్ఠుఁడు = తనకులాచారము తఱుచుగాఁ గలవాఁడు, నిక్కువంబు = సత్యము.
  7. వేదబహిష్కృతులన్ = వేదమువలన వెలిఁబడినవారిని, సంపాదించెదను = కలిగించెదను.