పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వృషలీతనుభవుని వృషలీవిభుని గృహదాహకుఁ గానీను ధర్మరహితు
గ్రామయాజకుఁ గొండెగాని మాతాపితృభక్తిహీనునిఁ బదభ్రష్టుఁ గునఖిఁ


ఆ.

గుష్ఠరోగిఁ గుండుఁ గోళకు నతివృద్ధు, బేడి దేవలకునిఁ బిన్నపడుచు
వానిఁ బైతృకమున బ్రాహ్మణార్థము చెప్ప, వలవదండ్రు బుధులు వసుమతీశ.[1]

256


ఆ.

యోగ్యులైన బ్రాహ్మణోత్తములను దొలు, నాటిరాత్రి భోజనంబు పిదపఁ
బైతృకార్థముగను బ్రాహ్మణార్థము చెప్ప, వలయు వినయగౌరవములతోడ.

257


క.

స్త్రీసంభోగము గమనా, యాసముఁ గోపంబు నుడిగి యతినియమముతో
భూసురులుఁ దాను శాంత, వ్యాసత యజమానుఁ డుండవలయు నరేంద్రా.

258


క.

పైతృకకర్తలు భోక్తలు, నాతులతో రతులు సలిపినను వారలెపో
పాతకులు వారిపితరులు, రేతములోఁ గూలుదురు ధరిత్రీనాథా.[2]

259


క.

కావునఁ గర్తయు భోక్తయు, భావపరిజ్ఞానశుద్ధిఁ బాటించి ధరి
త్రీవరసుస్నానాదులు, గావించినపిదపఁ గుతపకాలమునందున్.[3]

260


క.

తనయింటికి విప్రులఁ గొని, చని శాస్త్రార్థంబు గాఁగ సంకల్పముతో
నొనర క్షణాదికృత్యము, లొనరిచి పాదములు గడిగి యుచితప్రీతిన్.[4]

261


వ.

ఆసనంబులం బ్రవేశంబు చేయించి.

262


తే.

విశ్వదేవార్థ మిరువురు విప్రవరులఁ, బ్రాఙ్ముఖంబుగ నొనరించి పైతృకార్థ
మవనిదివిజుల మువ్వుర నలవరించి, యుత్తరాభిముఖులుగఁ గూర్చుండఁబెట్టి.[5]

263


వ.

పితృపితామహప్రపితామహుల నిజగోత్రనామోచ్చారణపూర్వకంబుగా వసు
రుద్రాదిత్యరూపంబుల నమ్మహీసురులం బూజించి వర్గత్రయస్వరూపంబుగా నా
వాహనగంధపుష్పాదు లైనసర్వోపచారంబులును విధిప్రకారంబుగ నాచరించి

  1. పరిత్యాగి = బొత్తిగా విడిచినవానిని, సోమవిక్రయున్ = సోమలతను అమ్మునట్టివానిని, హరికథావిముఖున్ = విష్ణుకథలకు మాఱుమొగమైనవానిని, బధిరున్ = చెవిటివానిని, వృషలీ = పెండ్లిగాక రజస్వలయైన స్త్రీలోనగునది, గృహదాహటిన్ = ఇల్లు కాల్చినవానిని, కానీనున్ = పెండ్లికానిదాని కొడుకును, గ్రామయాజకున్ = ఊరిపురోహితుని, పదభ్రష్టున్ = ఉత్తమపదమునుండి తొలఁగినవానిని, కునఖిన్ = వికృతనఖుని, కుండున్ = మగఁ డుండఁగా ఱంకుమగనికిఁ గన్నదానికొడుకును, గోళకున్ = మగఁడు చచ్చినపిమ్మట ఱంకుమగనికిఁ గన్నదాని కొడుకును, పేడిన్ = నపుంసకుని (లేక) తగినవయసు వచ్చియు మీసము మొలవనివానిని, దేవలకునిన్ పూజారివానిని, పిన్నపడుచువానిన్ = బాలుని, పైతృకంబులకు = పితృకర్మలకు.
  2. కర్త = చేయువాఁడు, భోక్త = భుజించువాఁడు.
  3. కుతపకాలము = మిట్టమధ్యాహ్నము.
  4. క్షణము = నిమంత్రణార్థము నియమించి యిచ్చెడు అక్షతలు మొదలగునది.
  5. ప్రాఙ్ముఖంబుగ = తూర్పుమొగముగా, అలవరించి = జతపఱిచి.