పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రాణవాయువు దొలఁగినయంతమీఁద, విధియుతంబుగఁ దత్కాలవిధులు దీర్చి.[1]

251


తే.

అగ్నిసంస్కారకర్మంబు లాదిగా స, మస్తవిధులును వేదోక్తమార్గములను
బెరయఁజేసి తిలోదకపిండదాన, ములు యథావిధిఁ గావింపవలయు నెఱిఁగి.[2]

252


క.

ద్విజులకుఁ బదిదినములు భూ, భుజులకుఁ బండ్రెండుదివసములు విట్ఛూద్ర
వ్రజములకుఁ బక్షమాసము, లు జనాధిప సూతకంబులు సుమీ వరుసన్.[3]

253


వ.

ఇట్లు సూతకాంతదివసంబున నేకోద్దిష్టంబును మఱునాఁడు సపిండీకరణంబును
జేసి సంవత్సరపర్యంతంబు నేకోద్దిష్టంబు చేయునది ప్రతిసాంవత్సరికమృతాహం
బున నన్నశ్రాద్ధంబు చేయవలయు.[4]

254

నిమంత్రణబ్రాహ్మణనిరూపణము

సీ.

ఆచార్యుఁ ద్రిమధుఁ ద్రిణాచికేతుని ద్రిసువర్ణు నానావేదపారగుని ష
డంగవేదిని విష్ణుసంగతహృదయుని యోగీశ్వరుని శ్రోత్రియుని మఖేజ్యు
వివిధసామజ్ఞు ఋత్విజు మేనయల్లుని నల్లుని దౌహిత్రు నతనితండ్రిఁ
బంచమహాయజ్ఞపరు మేనమామను వియ్యము నురుతపోవిభవు శిష్యు


తే.

మాతృపితృభక్తుఁ గారుణ్యమయు గుణాఢ్యు, నిర్మలాచారసంపన్ను నియమహృదయుఁ
బైతృకశ్రాద్ధమునకును బ్రాహ్మణార్థ, మర్థిఁ గావింపవలయును బార్థివేంద్ర.[5]

255


సీ.

మిత్రవంచకుని స్వామిద్రోహి నతినీలదంతు జారునిఁ బరదారగమను
వేదపరిత్యాగి వేదవిక్రయు సోమవిక్రయు హరికథావిముఖు బధిరు

  1. నామత్రయోచ్ఛారణంబు చేసి = మూఁడు నామములను ఉచ్చరించి, విధియుతంబుగన్ = శాస్త్రవిధితో, తత్కాలవిధులు = ఆకాలమునకుఁదగినపనులు, తీర్చి = నెఱవేర్చి.
  2. అగ్నిసంస్కారకర్మంబులు = దహనక్రియలు, బెరయన్ = పొందునట్లు, యథావిధిన్ = విధిప్రకారము.
  3. విట్ఛూద్రవ్రజములకున్ = వైశ్యశూద్రసమూహములకు, పక్షమాసములు = వైశ్యులకు పదియేనుదినములును, శూద్రులకు నెలదినములును.
  4. సూతకాంతదివసంబునన్ = అంటు తీఱునట్టిదినమునందు, ఏకోద్దిష్టంబు = ఒకని నుద్దేశించి చేయు శ్రాద్ధము, ప్రతిసాంవత్సరికమృతాహంబునన్ = ప్రతిసంవత్సరమునందలి మృతతిథియందు.
  5. ఆచార్యుని = గురువును, త్రిమధున్ = మధుత్రయాధ్యేతయై తదర్థానుష్ఠాతయగువానిని, త్రిణాచికేతున్ = త్రిణాచికేతములను అనువాకములను అధ్యయనము చేసి తదర్థములను అనుష్ఠించువానిని, త్రిసువర్ణున్ = త్రిసువర్ణ ములు ఆనుమూఁడు అనువాకములను అధ్యయనము చేసి తదర్థములను అనుష్ఠించువానిని, నానావేదపారగున్ = ఎల్లవేదములను తుదముట్ట చదివినవానిని, షడంగవేదిన్ = ఆఱుఅంగములతోను వేదము చదివినవానిని, విష్ణుసంగతహృదయున్ = విష్ణువును మనస్సునం దుంచుకొన్నవానిని, శ్రోత్రియునిన్ = శ్రుత్యాచారము తప్పక నడపువానిని, మఖేజ్యున్ = యజ్ఞములచేత పూజ్యుఁడైనవానిని, వివిధసామజ్ఞున్ = నానావిధములైన సామముల నెరుఁగినవానిని, ఋత్విజున్ = యజ్ఞము నడుపువానిని, వియ్యమున్ = వియ్యంకుని, అర్థిన్ = ప్రియపూర్వకముగా.