పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఒంటిఁద్రోవఁ జనుటయును నిండి పాఱెడి, యేటిలోన నుఱికి యీఁదుటయును
దహనమైనయిల్లు దఱియఁ జొచ్చుటయుఁ బ్ర, మాదమండ్రు బుధులు మనుజనాథ.[1]

231


క.

పలుమాఱు బిట్టునవ్వుట, పలు గొఱుకుట యనుచితములు భాషించుట వి
చ్చలవిడిఁ దుమ్ముట యూరక, తలఁ పుడుకుట దుష్టచేష్టితము లెవ్వరికిన్.[2]

232


క.

ఊరక పుడకలు విఱుచుట, వైరంబున నొరులతోడ వాదడుచుట దు
ర్వారగతిఁ బరువు వాఱుట, గోరన్ గో రొలుచుటెల్లఁ గొఱగాదు సుమీ.[3]

233


క.

ఊరక మీసము గొఱుకుట, వారక పాదమున నేలవ్రాయుట చెక్కుల్
సారెకు చేతులఁ బిసుకుట, పౌరుషముల కెల్ల హాని పాటిల్లు నృపా.[4]

234


క.

రాత్రి యమేధ్యముతో న, క్షత్ర గ్రహవిమలతారకాపఙ్క్తులపై
నేత్రములు నిల్పి చూచుట, ధాత్రీశ్వర దోషమండ్రు తత్వజ్ఞు లిలన్.[5]

235


క.

భాను నుదయాస్తమయములఁ, బీనుఁగుఁబాడియను రతులఁ బెనఁగెడువారిన్
మానినుల నగ్నరూపుల, భూనాయక చూడఁజనదు పుణ్యాత్ములకున్.[6]

236


ఆ.

అసతియింటిలోన నారామములను శృం, గాటకముల వల్లకాటిలోన
యుద్ధభూమిలోన నుగ్రాటవులయందు, నొక్కరుండ రాత్రు లుండఁజనదు.[7]

237


ఆ.

శూన్యగృహములందు శూన్యదేశంబుల, నొంటి నెట్టివార లుండఁజనదు
గురుజనముల భూమిసురులు దేవతలను, నెదురుకొనినఁ దొలఁగి యేగవలయు.

238


క.

బలిభస్మంబును గంటక, ములు విష్ఠయు ఛిన్నకేశములు నెమ్ములు నెం
గిలియును స్నానార్ద్రమహీ, తలముం ద్రొక్కంగఁ జనదు ధర్మజ్ఞులకున్.[8]

239


క.

పలుమఱు గొమ్ములు గోఱలు, గలిగినజంతువులఁ జేరఁగాఁ జన దెదురెం
డలు మంచు నెదురుగాలియు, దలసోఁకినఁ దెవులు వచ్చు ధరణీనాథా.[9]

240


తే.

లోన దోవతి గట్టక మానవేంద్ర, నిద్రవోవను నడవను నీతిగాదు

  1. ఉఱికి = దుమికి, దహనము = కాలినది, తఱియన్ = చేర, ప్రమాదము = మోసము.
  2. బిట్టు = గట్టిగా, తలఁ పుడుకుట = మనస్సు తపించుట - మనస్తాపము, దుష్టచేష్ఠికములు = చెడునడవళ్లు.
  3. వాదడుచుట = వాదాడుట, పరువు వాఱుట = పరుగెత్తుట.
  4. వారక = మానక, పౌరుషములకున్ = పురుషార్థములకు, పాటిల్లున్ = కలుగును.
  5. అమేధ్యముతోన్ = మలముతో - పాఁచితోననుట.
  6. నగ్నరూపులన్ = దిపమొలవారిని.
  7. అసతి = ధూర్తస్త్రీ, ఆరామములన్ = ఉపవనములందును, శృంగాటకములన్ = చదుకములయందును, వల్లకాటిలోనన్ = శ్మశానమునందును, ఉగ్రాటవులయందున్ = భయంకరమైన అడవులయందు, ఒక్కరుండు = ఒకఁడే, చనదు = తగదు.
  8. విష్ఠ = మలము, ఛిన్నకేశములు = గొరిగిన వెండ్రుకలు, ఎమ్ములు = ఎముకలు, స్నానార్ద్రమహీతలము = స్నానము చేయుటచేత తడిసిననేలను.
  9. తెవులు = వ్యాధి.