పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్సరముల్ చెందుదు రట్టియన్యవనితాసంభోగదోషంబు దా
నరనాథోత్తమ యింత యంత యనియెన్నన్ వచ్చునే నేరికిన్.[1]

223


క.

కావునఁ బరకాంతారతి, గావింపక ధర్మమార్గగతి దప్పక యి
చ్ఛావృత్తి నాత్మభామిని, తో వేడుక సలుపవలయు దురితవిదూరా.

224


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

225


సీ.

దేవతాగోబ్రాహ్మణావలిఁ బొడగన్న మ్రొక్కి సంధ్యాద్వయంబును దిశాధి
పతులఁ బ్రార్థించి తప్పక యగ్నిహోత్రంబు లొనరించి తెల్లగా నుదికినట్టి
మణుఁగుఁజీరలు గట్టి మణిభూషణముఁ బెట్టి కస్తూరితోఁ గమ్మగంద మలఁది
సురుచిరం బైనట్టి చొక్కంపుఁబూదండ లొఱపుగా శిరమున నొప్పఁ దాల్చి


తే.

మస్తకంబును నొడలును మాయనీక, యేకశయ్యనై పవళించి యిచ్ఛవచ్చి
నపుడు భోగించి బహుభాష లాడఁబోక, శాంతుఁడై యుండవలయును సజ్జనుండు.[2]

226


క.

పరకాంతపొందుఁ గోరక, పరధనములమీఁద నాస పాటింపక యె
వ్వరితోడఁ గల్లలాడక, సరసుండై యుండవలయు సజ్జనుఁ డధిపా.[3]

227


క.

వినియెడువారికి హితమై, నను సత్యముఁ దప్పఁజనదు నానయు భయమున్
మనమునఁ దలఁపక పరులను, బనివడి దూషించెనేని పాపము వచ్చున్.[4]

228


తే.

పరులతోడుత వైరంబు బంధురోష్ట్ర, వాహనారోహణంబును వానకాల
మేటిదరినీడ నిద్రింప నేగుటయును, గడుఁబ్రమాదంబు లగు నండ్రు కార్యవిదులు.

229


మ.

పతితుం దస్కరు వెఱ్ఱివానిఁ బగతున్ బాపాత్మునిన్ బంధకీ
పతి నీచున్ వ్యభిచారు సత్యరహితున్ భ్రాతృవ్యు వారాంగనా
రకు నత్యంతఋణస్థు దుర్జను ననారంభున్ సురాపానమో
హితు బాలుం బరమాప్తుఁ జేయుటలు గా దెవ్వారికిన్ భూవరా.[5]

230
  1. పరివాదంబును = అపవాదమును, నేరికిన్ = ఎవరికేనియు.
  2. సంధ్యాద్వయంబును = ప్రాతస్సాయంసంధ్యలు రెంటియందు, మణుఁగు = మడుఁగు - పరిశుద్ధము, కమ్మగంధము = పరిమళచందనము, అలఁది = పూసికొని, చొక్కము = శ్రేష్ఠము, ఒఱపుగాన్ = ఒప్పిదముగా, మస్తకము = తల.
  3. కల్లలు = అసత్యములు.
  4. నాన = సిగ్గు, పనివడి = పూనికతో.
  5. పతితున్ = ఆచారాదులచేత నిందింపఁబడినవానిని, బగతున్ = శత్రువును, బంధకీపతిన్ = ఱంకులాడిమగనిని, వ్యభిచారున్ = జారుని, వారాంగనారతున్ = లంజల మరిగినవానిని, అనారంభున్ = సత్క్రియారంభము లేనివానిని, సురాపానమోహితున్ = కల్లు త్రాగుటచే మైకము పొందినవానిని.