పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

పట్టెమంచంబు దలగడ పఱుపు దెరయు, మేలుకట్టును బొడవైనమేడమీఁదఁ
జల్లగాలియు ధూపవాసనలు నున్న, యట్టిశయ్యకుఁ జని నిద్ర నందవలయు.

216


తే.

తూర్పుదక్షిణములలోన దొరికినట్టి, దిక్కు తలగడ గాఁగ నిద్రించెనేని
మేలు తక్కినదిక్కులు మేదినీశ, యధికరోగంబు గావించు ననిరి బుధులు.

217


తే.

అనఘ పురుషనక్షత్రంబు లైన జ్యేష్ఠ, మొదలుగాఁ గలనక్షత్రముల నయుగ్మ
కములనై నను ఋతుదివసములనైనః, దనకులాంగనఁ గవయుట ధర్మ మగును.[1]


సీ.

పరకాంత ముట్టైనపడఁతి నన్యాసక్త యైనతొయ్యలి దుఃఖి యైనచెలువ
సంతసం బెఱుఁగనిసతి ననాచారంపుటిభయాన బాలింత యిగురుబోఁడి
నిష్ఠమాలినలేమ నిర్మోహి యగుకొమ్మ కలహంబు వెట్టెడికమలవదన
రతులు నేరుపు లేనిరామ జారయుఁ జోర కుమతి యౌ నెలనాఁగ కూటిపేద


తే.

యైన మృగనేత్ర పరితుష్ట యైనయువతి, తన్ను మెచ్చనితన్వంగి దమ్ములంబు
నీనిపద్మాస్య కడురోగి యైనయువతి, రతి యొనర్పంగఁ గోఱగాదు రసికులకును.[2]

219


సీ.

రతితంత్రములయందుఁ బ్రౌఢయై తనమీఁద నత్యంతభయభక్తు లతిశయిల్ల
సౌకుమార్యముచేత నేకొదవయులేక సుందరాకారత సొంపు గలిగి
సరసశృంగారవేషముల నెంతయు మించి యుచితప్రియాలాపరచన లెఱిఁగి
వినయవిధేయవివేకశీలతలచే ననుకూలమును నెఱతనము నేర్చి


తే.

నిర్మలాంగియు నిపుణయు నిర్మలాభి, జాత్యయును బుణ్యవతియును సతియునైన
తనకులాంగన రతికేళిఁ దనిపెనేని, యతని కైహికలోకసౌఖ్యములు గలుగు.[3]

220


తే.

అనఘ విను పౌర్ణమాసుల నమవసలఁ జ, తుర్ధసులయం (?)దష్టమీప్రదోషములను
సంక్రమణములయందును సతుల రతుల, ననుభవింపంగ రాదని రార్యులెల్ల.

221


తే.

చైత్యచత్వరగోష్ఠశ్మశానతీర్థ, వారిశృంగాట కారామవాహినీసు
రాలయగ్రామమధ్యంబులందుఁ బగలు, సతులఁ గవిసిన దోషంబు సంభవించు.[4]

222


మ.

పరకాంత న్మదిలోననైనఁ దలఁపం బాపంబు దుఃఖంబునుం
బరివాదంబును నొంది ఘోరనరకప్రాప్తవ్యథల్ పెక్కువ

  1. అయుగ్మకములు = బేసిలెక్కగలవి.
  2. నిర్మోహి = మోహములేనిది, కుమతి = అల్పబుద్ధి గలది, తన్వంగి= స్త్రీ, కొఱగాదు = తగదు.
  3. ప్రౌఢ = గడిదేఱినది, ఉచితప్రియాలాపరచనలు =- తగిన ప్రియవాక్యములయొక్క పొందుపఱచుటలు, నెఱతనము = చాతుర్యము, నిర్మలాభిజాత్య = శుద్ధమైన ఉత్తమవంశమునందలి పుట్టుక గలది, సతి = పతివ్రత, కులాంగనన్ = ఇల్లాలి.
  4. చైత్యచత్వరగోష్ఠశ్మశానతీర్థవారిశృంగాటకారామవాహినీసురాలయగ్రామమధ్యంబులందున్ = రచ్చచెట్టు ముంగిలి పసులమంద శ్మశానము పుణ్యనదీపుణ్యస్థలములు నీరు నాలుగుత్రోవలు గూడిన రాజమార్గము ఉపవనము ఏఱు దేవాలయము ఊరినడుము ఈప్రదేశములయందును.