పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నై యరిష్టాత్మకము లైనయరులవలని, భయము నభిచారకృత్యముల్ పరిసిపోవు.[1]

209


వ.

కావున గృహమేధి యథాప్రకారంబున స్నానతర్పణసంధ్యాజపదేవపూజాగ్ని
హోత్రవైశ్వదేవబలిహరణంబులు నిర్వర్తించి యన్నార్థు లైనయభ్యాగతులం
బూజించి ప్రశస్తమణిముద్రికాధరుండును ధవళవస్త్రయుగ్మపరివృతుండును గంధ
పుష్పాలంకృతుండును శుద్ధోదకార్ద్రపాదహస్తుండును నాచమనక్రియాపరిశుద్ధ
వదనుండును నై యపరదిశాముఖుండు గాక పూర్వాభిముఖుండై సుఖాసనం
బునం గూర్చుండి ప్రశస్తశుద్ధపాత్రంబులందు సర్వగుణసంపన్న యైనధర్మపత్ని
వడ్డింప నిజశిష్యపుత్రబంధుమిత్రసహితుండై భుజియించుచు.[2]

210


తే.

మునుపు మధురాన్నములు చవిగొనియెనేని, నడుమ లవణామ్లతిక్తముల్ నంజెనేని
పిదప కటుకార్ద్రభోజనం బొదవెనేని, బలము నారోగ్యమును జాల గలిగియుండు.[3]

211


వ.

ఇవ్విధంబునఁ బంచప్రాణాహుతిపూర్వకంబుగా భుజియించి యుచ్ఛిష్టవార
ణార్థంబుగాఁ బాణిపాదప్రక్షాళనంబులు చేసి స్వస్థప్రశాంతచిత్తుండై కూర్చుండి
యభీష్టదేవతాస్మరణంబు చేసి భోజనంబు సుఖజీర్ణంబుగా నగస్త్యబడబానల
స్తోత్రంబు లనుష్ఠించి యనాయాసం బైనయానంబున నుచితప్రయోజనం
బులు నడపి వేదశాస్త్రప్రసంగంబులం బొద్దుపుచ్చి యపరసంధ్యావిధులు నిర్వ
ర్తింపవలయు.[4]

212


తే.

రేపు చుక్కలఁ జూచుచు మాపు తిమిర, వైరిఁ జూచుచు సంధ్య వార్వంగవలయు
నట్టివేళలు దప్పించి యాచరించు, నిత్యసంధ్యావిధానముల్ నిష్ఫలములు.[5]

213


వ.

కావున యథాకాలంబున సంధ్యావందనంబు దీర్చి తాంబూలచర్వణం బొన
రించి శయ్యాతలంబునం బవ్వళింపవలయు.

214


ఆ.

కుక్కిపడిన మిగులఁ గొంగోడువోయినఁ, గుఱుచయైన విఱిగి కొంచెమైన
మలినమైన నేఁత పలచనైనను నల్లు, లున్న నుల్కమంచ మొప్ప దండ్రు.[6]

215
  1. అరిష్టాత్మకములు = చెఱుపును గలుగఁజేయు స్వభావము గలవి, అభిచారకృత్యములు = మారణకర్మములు, పరిసిపోవున్ = తేలిపోవును - తప్పిపోవుననుట.
  2. గృహమేధి = గృహస్థుఁడు, ప్రశస్తమణిముద్రికాధరుండు = దోషములు లేనిరత్నములు చెక్కిన ఉంగరమును ధరించినవాఁడు.
  3. చవిగొను = రుచిచూచు - భుజించు, సంజుజనంజుకొను, కటుకార్ద్ర = కారము గలదియు ద్రవమైనదియునైన.
  4. ఉచ్ఛిష్టవారణార్థంబుగాన్ = ఎంగిలి పోఁగొట్టుకొనుటకుఁగాను, స్వస్థ = చలనము లేవి, ప్రశాంత = మిక్కిలియోర్పుగల, అనుష్ఠించి = చేసి.
  5. రేపు = ప్రాతఃకాలము, మాపు = సాయంకాలము, తిమిరవైరిన్ = సూర్యుని.
  6. కుక్కిపడినన్ = అల్లికనళ్లి పల్లము పడినను, కొంగోడువోయిన = తడిసి ఒకకోడు మీఁదును ఒకకోడు క్రిందునుగా నీల్గుకొన్నను, ఒప్పదు = తగదు.