పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బలులు వెట్టి గృహస్థుండు సకలభూతసమాశ్రితుండు గావున గోదోహన
మాత్రకాలంబు బహిఃప్రదేశంబున నభ్యాగతాగమనంబుఁ గోరుచు నిలుచుండి
పుణ్యవశంబున నతిథి వచ్చిన.[1]

200


క.

తనపాలిభాగ్యదేవత, యని లోనికిఁ గొంచుఁబోయి యర్షం బగునా
సన మిడి యర్ఘ్యముఁ బాద్యము, నొనరించి మనంబులోన నొదవినభక్తిన్.

201


క.

నామకులగోత్రవిద్యా, భూములు ము న్నడుగ కతనిఁ బూజించి యభీ
ష్టామృతరసాన్నపానము, లామహితున్ విష్ణుమూర్తి యని యిడవలయున్.[2]

202


మ.

నరనాథోత్తమ బ్రహ్మచారి గృహి వానప్రస్థ సన్న్యాసులం
దొరుఁ డెవ్వాఁ డట వింతబ్రాహ్మణుఁడు దా నొప్పన్ క్షుధావేదనా
పరుఁ డై వచ్చిన నన్నదాన మొనరింపన్ లేక దుర్మార్గత
త్పరుఁ డై యొంటిఁ జరించెనేని నరకప్రాప్తుం డగున్ దీనతన్.[3]

203


క.

కావున నతిథులఁ బూజలు, గావించి యథోచితప్రకారంబున ధా
త్రీవర భిక్షంబులు నిడ, గావలయు గృహస్థధర్మకలితులకెల్లన్.

204


క.

ఆపంకజాసనుండుఁ బ్ర, జాపతులును బావకుండు శక్రుండును ల
క్ష్మీపతియును నాదిత్యమ, హాపురుషులు వత్తు రింటి కభ్యాగతులై.[4]

205


తే.

అవనీనాయక యన్నార్థు లైనవృద్ధ, బాలకుల గర్భిణుల దుఃఖభాజనులయుఁ
గోర్కి దీర్పక తా నొంటిఁ గుడిచెనేని, వాఁడు కడుఘోర మగురౌరవమునఁ గూలు.[5]

206


ఆ.

అన్నకాంక్షు లైనయఖిలజనంబులఁ, దనిపిగాని కుడువఁ దనకుఁ జనదు
మునుపు దా భుజించి వెనుక నతిథి కిడు, వాఁడు గూలు రౌరవంబునందు.[6]

207


తే.

స్నానమును దర్పణంబును సంధ్యయును జ, పంబు దైవతపూజ హోమంబు వైశ్వ
దేవమును మఱి యతిథిపూజావిధంబు, మాని భుజియించుటెల్లను మలము దినుట.

208


తే.

అన్నదానంబు చేసినయమ్మహాత్ము, నకును బలము నారోగ్యంబు ప్రకటశుభము

  1. ధౌతవస్త్రపరిజ్ఞానుండు = మడుఁగువస్త్రము కట్టుకొన్నవాఁడు, ఉపాస్తి = ఉపాసన, హుతశేషాన్నంబు = హోమము చేయఁగా మిగిలినయన్నము, భూతప్రేతపిశాచకూశ్మాండపిపీలికాది = భూతము ప్రేతము పిశాచము కూశ్మాండము (అను భేదములుగల) భూతములు చీమలు మొదలైన, సకలభూతసమాశ్రితుండు = ఎల్లభూతములచేత ఆశ్రయింపఁబడువాఁడు, గోదోహనమాత్రము = ఆపువును పిదుకునంతటికాలము, బహిఃప్రదేశంబునన్ = ఇంటి వెలుపట, ఆగమనంబు = రాకను.
  2. మహితున్ = పూజ్యుని.
  3. గృహి = గృహస్థుఁడు.
  4. పావకుండు = అగ్ని, శక్రుఁడు = ఇంద్రుఁడు.
  5. దుఃఖభాజనులు = దుఃఖమునకు చోటైనవారు - దుఃఖమును పొందినవారు.
  6. తనిపి = తృప్తి పొందించి.