పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తనదులింగంబునందు గుదస్థలమున, వామహస్తమునను గటిద్వయమునందు
వరుస నేకత్రిదశసప్తవారములను, మృత్తికాశౌచ మొనరింప మేలు గలుగు.

195


వ.

కేశవాదినామంబులతోడ గోకర్ణహస్తంబున మాషమజ్జనపరిమితశుద్ధోదకంబుల
ముమ్మాఱు లోనికిం గొని యినుమాఱు పరిమార్జనంబు చేసి దక్షిణపూర్వకం
బులుగా నేత్రనాసాపుటశ్రోత్రద్వయశిరోబాహుద్వయనాభిహృదయంబుల
న్యసించి యాచమనంబు చేసి.[1]

196


క.

తల నిమ్మపండ్లు మొదలుగఁ, బులుసులు పట్టించి పుష్పములు నంజనముం
జెలువొప్పఁ బూని కడుని, ర్మలహృదయముతోడ నుదకమధ్యంబునకున్.

197


చ.

అరిగి సమస్తనిర్ఝరయంబును నవ్యసుధాకరాభమున్
బరమపవిత్రమున్ సకలపాపహరంబును నైననీరుఁ ద
త్పరమతి విష్ణురూపముగ భావన చేసి కృతావగాహత
త్పరుఁ డగుపుణ్యపూరుషుఁడు ధన్యుఁ డగున్ భువనత్రయంబునన్.[2]

198


తే.

నదుల నదములఁ జెఱువుల హ్రదములందు, దేవఖాతజలంబుల దీర్ఘకలను
గూపములఁ బల్వలంబులఁ గోరి దినము, తాన చూడంగవలెఁ గాని మానరాదు.[3]

199


వ.

ఇట్లు సంకల్పపూర్వకంబుగా స్నానంబు చేసి వెడలివచ్చి ధౌతవస్త్రపరిధానుం
డై దేవర్షిపితృతర్పణంబులు సేసి సంధ్యాదికక్రియలు నిర్వర్తించి సూర్యోపాస్తి
యెవర్చి నిజగృహంబునకు వచ్చి యథాప్రకారంబుగ పోడశోపచారంబుల
తోడ దేవతార్చన గావించి జపౌపాసనవైశ్వదేవంబులు చేసి యుక్తప్రకారస్థా
నంబుల నాయాదేవతలకుఁ బ్రీతిగా హుతశేషాన్నంబు బలులు పెట్టి గృహంబు
వెలుపలను భూతప్రేతపిశాచకూశ్మాండపిపీలికాదిజంతువులకుఁ దత్తన్మంత్రంబుల

  1. మాషమజ్జనపరిమితశుద్ధోదకంబులన్ = మినుపగింజ మునుఁగునంతకొలఁదిగల మంచినీళ్లను, పరిమార్జవంబు చేసి = చక్కగా తుడిచికొని, న్యసించి = ఉంచి - ముట్టి యనుట.
  2. నిర్ఝరమయంబు = నదీస్వరూపమైనది, నవ్యనుధాకరాభము = లేఁతచంద్రునిఁ బోలినది, భావన చేసి = తలఁచి, కృతావగాహతత్పరుఁడు = చేయఁబడిన మునుకయందు ఆసక్తుఁడు - ఆసక్తితో స్నానము చేసినవాఁడు.
  3. నదములన్ = పడమరగా పాఱునట్టి యేళ్లయందును, హ్రదములందున్ = మడుఁగులయందును, దేవఖాతజలంబులన్ = దేవతలచే త్రవ్వఁబడిన (మనుష్యులు త్రవ్వఁగా ఏర్పడని) కొండదోనలోనగువానియందలి నీళ్లయందు, దీర్ఘికలన్ = నడబావులయందును, పల్వలంబులన్ = పడెలయందును, తానము = స్నానము.