పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొనరన్ మేల్కని సావధానమతితో నుద్యద్వికాసంబునన్
దనయాచార్యుని నిష్ట దైవచరణధ్యానంబుఁ గావించి ధ
ర్మనిరోధంబులు గానియర్ధమును గామంబున్ విచారించుచున్.[1]

188


తే.

ప్రకటధర్మార్థకామంబులకుఁ బరస్ప, రానుకూలంబు గలయుపాయములు దలఁచి
యతిసుఖోదరమును జగదభినుతంబు, నైనధర్మంబు వదలనిమానసమున.[2]

189


వ.

శయ్యాగృహంబు వెడలి గ్రామంబునకు నిరృతిభాగంబున నమ్మువేటునేలకంటెను
దూరంబుగాఁ జని ముసుంగుపెట్టుకొని మౌనంబున గోసూర్యబ్రాహ్మణవా
యుగురువహ్నిదేవతల కభిముఖుండు గాక దివసంబుల నుత్తరాభిముఖం
డును రాత్రుల దక్షిణాభిముఖుండును నై మూత్రపురీషోత్సర్జనంబులు సేయ
వలయు.[3]

190


ఆ.

వీథి నూరినడుమ విత్తినపైరులో, మాకునీడ నాలమందలోన
నేటినడుమ వల్లకాటిలో దుక్కిలో, నీళ్లనడుమ గాదు నీరుముట్ట.[4]

191


తే.

రచ్చఁ దెరువును గృహవాటి మచ్చుమీఁద, నీటిచేరువఁ గొఱగాదు నీరుముట్ట
వసుధమీఁదను దళముగా గసవు బఱపి, వేగ మూత్రపురీషముల్ విడువవలయు.

192


ఆ.

పుట్టమన్ను గోడపెట్టినమన్నును, జలములోనిమన్ను నెలుకమన్ను
దుక్కిమన్ను పురుగుచెక్కినమన్నును, శౌచమునకుఁ గాదు సంగ్రహింప.

193


తే.

ధరణిఁ బరిశుద్ధమైనచోఁ దానె త్రవ్వి, మన్ను గొనివచ్చి బుద్బుదమలినఫేన
పూతిగంధాదు లెవ్వియుఁ బొరయకున్న, జలములను శౌచ మొనరింపవలయు ననఘ.[5]

194
  1. ఒదవన్ = కలుగఁగా, బ్రాహ్మంబు = బ్రాహ్మమను పేరుగలది (సూర్యోదయమునకు ముందు మూఁడవముహూర్తము)- వేకువజాము అనుట, ఉద్యద్వికాసంబునన్ = ప్రకాళించునట్టి తేటదనముతో, ధర్మనిరోధంబులు = ధర్మమును అడ్డగించునవి - ధర్మవిరుద్ధములు.
  2. సుఖోదర్కము = సుఖకరమైన భవిష్యత్కాలఫలము గలది, జగదభినుతము = లోకమునందు మిక్కిలి కొనియాడఁబడునది.
  3. అమ్మువేటునేలకంటెన్ =వింటిపట్టుదూరము గలభూమికంటె, అభిముఖుండు = ఎదురుమొగమైనవాఁడు, దివసంబులన్ = పగళ్ళయందు, మూత్రపురీషోత్సర్జనంబులు = మూత్రమును మలమును విడుచుటలు.
  4. ఆలమందలోనన్ = పసులమందయందు, వల్లకాటిలోనన్ = శ్మశానమునందు, కాదు = తగదు. నీరుముట్ట = మూత్రమును మలమును విడుచుట.
  5. బుద్బుదమలినఫేనపూతిగంధాదులు = నీళ్లమీఁది బుగ్గలు నురుగు మురికి చెడ్డకంపు మొదలగునవి, పొరయక = పొందక, శౌచము = శుద్ధి.