పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్మశ్రుముఖిని బురుషస్వరరూక్షాక్షి ఖర్వరూపక హీనకంఠనాద


తే.

వివృతబద్ధాక్షి నున్నతవిపులగుల్ఫఁ, గాకనాదను రోమజంఘను విపాండు
కరజ నరుణాక్షి గండకూబర కరాళ, వదన నుద్వాహమైన నొప్పదు నరేంద్ర.[1]

182


ఆ.

హస్తపాదహీన నతిదీర్ఘ వామన, క్లిన్నరక్త నతివికీర్ణకేశఁ
గపటహృదయఁ బంగుగమనఁ బ్రాణిగ్రహ, ణంబు గాఁగఁ దగదు నరవరేణ్య.[2]

183


ఆ.

తల్లివంక నైదుతరముల వివరించి, తండ్రివంక నేడుతరము లరసి
వారివారిగోత్రవంశసంకరము గా, నియక యతివఁ బెండ్లి యయిన మేలు.

184


వ.

బ్రాహ్మంబును దైవంబును నార్షంబును బ్రాజాపత్యంబును నాసురంబును గాంధ
ర్వంబును రాక్షసంబును బైశాచంబును నను నెనిమిదివివాహంబులయందును
నాయావర్ణధర్మంబు లైన వివాహంబులను దారపరిగ్రహంబు చేసి తద్ధర్మపత్నీ
సమేతంబుగాఁ బరమగృహస్థధర్మంబున నున్న మహాత్ముండు సకలలోకంబులకు
నుత్తమశ్లోకుం డగు ననిన సగరుం డిట్లనియె.[3]

185


క.

మునివర గృహస్థధర్మం, బునఁ బాయకయున్న పరమపుణ్యుల యాచా
రనియతులెల్లను దప్పక వినవలతుఁ జెప్పు మతివివేకప్రౌఢిన్.

186


వ.

అనియడిగిన యాభృగువంశశిఖామణి యన్నరేంద్రచంద్రు నవలోకించి సదా
చారవంతు లైనగృహస్థు లుభయలోకంబులయందును నత్యంతసౌఖ్యంబు
లనుభవింతురు. తొల్లి స్వాయంభువాదు లైనమనువులును సప్తమహామును
లును బ్రజాపతులును సకలలోకోపకారకంబులుగా సదాచారమార్గంబులు
గల్పించిరి గావున నిజవర్ణధర్మంబు లైన యాచారంబు లవశ్యంబును నాచరిం
పవలయు వినుము.

187

గృహస్థసదాచారరూపములైన నిత్యకృత్యములు వివరించుట

మ.

అనురాగం బొదవ గృహాధిపతి బ్రాహ్మంబౌ ముహూర్తంబునం

  1. నైసర్గిక = స్వభావసిద్ధమైన, శోఫిన్ = వాఁపుగలదానిని, కృష్ణవర్ణన్ = నల్లనిదానిని, రోమాంగిన్ = అతిరోమముగల దేహముగలదానిని, కులటన్ = ఱంకులాఁడిని, రోగిన్ = రోగముగలదానిని, దుష్టాత్మన్ = చెడ్డమనసుగలదానిని, దుష్టవాత్సల్యన్ = కపటప్రీతిగలదానిని, నికృష్టవృత్తిన్ = నీచవ్యాపారము గలదానిని, అధికపింగళన్ = మిక్కిలి పల్లవన్నె గలదానిని, వినయాచారహీనన్ = అడఁకువచేతను సదాచారముచేతను తక్కువైనదానిని, మాతాపితృప్రతికూలన్ = తల్లిదండ్రులకు విరుద్ధమైన నడతగలదానిని, శ్మశ్రుముఖిన్ = మీసము గలమొగము గలదానిని, పురుషస్వరన్ = మగగొంతు గలదానిని, రూక్షాక్షిన్ = క్రూరపుచూపు గలదానిని, ఖర్వరూపన్ = మిక్కిలి పొట్టియైనదానిని, విశృతబద్ధాక్షిన్ = మిడిగ్రుడ్లదానిని, ఉన్నతవిపులగుల్ఫన్ = పొడువును వెడలుపునైన చీలమండలు గలదానిని, కాకనాదన్ = కాకికూఁతవంటి కంఠస్వరము గలదానిని, రోమజంఘన్ = వెండ్రుకలుగల పిక్కలు గలదానిని, విపాండుకరణన్ = తెలుపు మాసిన గోళ్లు గలదానిని, అరుణాక్షిన్ = ఎఱ్ఱనికన్నులు గలదానిని, గండకూబరన్ = నిడుకణతలుగలదానిని, కరాళవదనన్ = భయంకరమైన ముఖము గలదానిని, ఉద్వాహము = పెండ్లి.
  2. క్లిన్న = తడిసిన - నీళ్లవలె పలుచనైన, అతివికీర్ణకేశన్ = మిక్కిలివిరళములైన తలవెండ్రుకలు కలదానిని, పంగుగమనన్ =కుంటిదానిని, పాణిగ్రహణంబు = పెండ్లి.
  3. దారపరిగ్రహంబు = పెండ్లామును చేపట్టుట, ధర్మపత్ని = అగ్నిసాక్షిగా పెండ్లాడిన పెండ్లాము, ఉత్తమశ్లోకుఁడు = మంచికీర్తిగలవాఁడు.