పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ములకు నోర్చి వానప్రస్థుఁ డలఘువృత్తి, దప మొనర్చినఁ గల్గు నుత్తమపదంబు.[1]

160


వ.

ఇవ్విధంబున వానప్రస్థాశ్రమంబు నడిపి చతుర్థాశ్రమంబుఁ బ్రవేశించి.

161


క.

పుత్ర కళత్రద్రవ్య, క్షేత్రారామముల నాస చెడి యెచ్చోటన్
మైత్రి యొనర్పక బ్రహ్మ, క్షత్రియవైశ్యక్రియలు విసర్జించి ధృతిన్.

162


తే.

వీతమత్సరుఁడై సర్వభూతచయము, నాత్మగతిఁ జూచుచు జరాయజాండజాది
జీవములయందు మోదస్వభావుఁ డగుచు, నమలధృతి నుండవలయు సన్యాసి యనఘ.[2]

163


క.

సౌహార్ధవచనరచనా, బాహుళ్యతవలన నెల్లప్రాణుల నధిక
స్నేహమున బుజ్జగించుచు, నైహికములు విడుచు టుచితముగు భిక్షునకున్.[3]

164


ఉ.

ఏకదినంబు గ్రామమున నేనుదినంబులు పట్టణంబునం
దేకమనంబుతోడ వసియించి త్రివర్గగృహంబులందు న
స్తోకత భిక్షమెత్తి పరితోషమునన్ భుజియించి దేహయా
త్రాకుశలంబు గైకొనుట ధర్మము భిక్షునకున్ నరేశ్వరా.[4]

165


క.

వ్యామోహంబును లోభము, కామక్రోధములు మదవికారము దర్పో
ద్దామమును లేక యాత్రా, రాముండై భిక్షుఁ డున్న రంజిల్లుఁ జుమ్మీ.[5]

166


క.

భిక్షాకదంబకంబున, నక్షయశారీరవహ్నియందును దినమున్
లక్షించి వేల్వఁగల్గిన, సాక్షాదీశ్వరుఁడు గాఁడె సన్న్యాసి నృపా.

167


వ.

ఇట్లు సంకల్పితబుద్ధియుక్తుండును నైహికానేకభోగవిరక్తుండును నత్యంతశౌచ
చిత్తుండును పరమతత్త్వవిద్యాయత్తుండును నై మోక్షాశ్రయం బాశ్రయించు
నమ్మహాతుం డింధనరహితంబైన వహ్నియునుంబోలె తన్నుఁ దానె ప్రశాంతుండై
బ్రహ్మలోకసుఖంబునం బొందునని చెప్పిన సగరుం డిట్లనియె.[6]

168


తే.

ఉత్తమము లగునిత్యనైమిత్తికప్ర, కారములు మూఁడు పురుషుఁ డేగతి నొనర్ప
వలయు నిత్తెఱం గెల్లను దెలియఁజెప్ప, వే కృపాచిత్తమున మునిలోకనాథ.

169


క.

అనవుడు భృగునందనుఁ డ, మ్మనుజేంద్రునిఁ జూచి నీవు మ మ్మడిగినయీ

  1. త్రిషవణస్నానంబు = త్రిశాలసంధ్యోపాననార్థస్నానము, వనస్నేహమునన్ = అడవియందు దొరకెడు (గార) నూనెచేత, హిమనిదాఘములకున్ = శీతోష్ణములకు.
  2. వీతమత్సరుఁడు = పోయిన మత్సరముగలవాఁడు, జరాయజాండజాది = మావివలనఁ బుట్టిన (మనుష్యాదులును) గ్రుడ్డువలనఁ బుట్టిన (పక్ష్యాదులును) మొదలైన, మోదస్వభావుఁడు = సంతోషస్వభావము గలవాఁడు, అమలధృతిన్ = కళంకములేని ధైర్యముతో.
  3. సౌహార్ద = స్నేహభావముగల, ఐహికములు = ఈలోకమునందలి సుఖములను, భిక్షునకున్ = సన్న్యాసికి.
  4. త్రివర్గగృహంబులందున్ = గృహస్థులయిండ్లయందు, అస్తోకతన్ = గౌరవముతో, దేహయాత్రాకుశలంబు = దేహమును పోషించుకొనునట్టి మేలును.
  5. వ్యామోహంబు = విశేషమోహము, దర్పోద్దామము = గర్వాతిశయము, రంజిల్లున్ = ప్రకాశించును.
  6. ఇంధనరహితంబు = చిదుగులు లేనిది.