పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దూరంబు నడచి ప్రొద్దునఁ బోక వచ్చిన తెరువరులును మఱి దిక్కులేని
పేదబ్రాహ్మణులు వినోదంబులకుఁ దమ్ముఁ బొడగన వచ్చినభూమిసురులు


తే.

మొదలుగ నతిథులయి తమసదనములకు, నేగుదెంచిన భక్తితో నెదురువోయి
తోడుకొనివచ్చి తనయింట దొరకినట్టు, లన్నపానంబులకు నుపాయంబు సేయఁ
గలుగుగృహమేధి పుణ్యలోకముల కరుగు.[1]

154


ఆ.

ఇంటఁ గలపదార్థ మేమియు దాఁపక, లేకయున్న ఋణము దేక యతిథి
కకభక్తితోడ నన్నపానాదులఁ, దృప్తిసేయవలయు దినదినంబు.

155


తే.

అతిథి యాఁకలిగొని యింటి కరుగుదెంచి, కడునుదాసీనమునఁ బొంది వెడలెనేని
తనకుఁ గలపాప మాగృహస్థునకు నిచ్చి, వానిపుణ్యంబు గొనిపోవు వసుమతీశ.[2]

156


ఆ.

కాన నతిథియందు గర్వంబు మదమును, బరుసఁదనము బెరుకుఁ బ్రల్లదంబుఁ
బొడమకుండఁజేసి భోజనశయనాస, నములఁ బ్రీతుఁ జేయు టమరు గృహికి.[3]

157


వ.

మఱియు ననేకప్రకారంబు లైనగృహస్థధర్మంబుల నిర్మలులై కంటులేక వర్తించు
మహాత్ములు పుణ్యలోకసుఖంబుల ననుభవింతురు. ఇప్పు డతిథిసత్కారంబులు
సేయుగృహపతులు గలగ్రామంబులు సకలశోభనధామంబులు నానారిష్టవిరా
మంబులు నగు నట్టిగృహమేధిధర్మంబు విడుచుటకంటెను బాతకంబు లేదు
సుమీ యని పలికి మఱియును.[4]

158


చ.

పరమగృహస్థధర్మపరిపాలన ఖేలనవృత్తి ధన్యుఁడై
పురుషుఁడు వార్ధకంబు తనుఁ బొందినఁ బుత్రకులం దదాశ్రమా
కరులుగఁ జేసి తానుఁ దనకాంతయుఁ గొనకు నేగి సత్తప
శ్చరణవిధంబు లేమఱక సంతతముం దప మాచరించుచున్.[5]

159


సీ.

దినము దప్పకయుండఁ ద్రిషవణస్నానంబు జరిపి గడ్డము పెంచి జడలుగట్టి
భూశాయియై ఫలంబులు శాకములుఁ గందమూలంబులును భుజింపుచుమహాజి
నము కుశంబులు వల్కలములును దేవపూజనము భూదేవతర్పణము చేసి
మంత్రతంత్రముల హోమంబు యథాప్రకారంబునం జేసి భిక్షంబు బలియు


తే.

నొనరఁబెట్టి వనస్నేహమున శరీర, మెల్ల నభ్యంగ మొనరించి హిమనిదాఘ

  1. ఆఁకటఁ గ్రాఁగువారు = ఆఁకటిచే తపించువారు, తెరువరులు = బాటసారులు, సదనములకున్ = ఇండ్లకు, గృహమేధి = గృహస్థుఁడు.
  2. ఉదాసీనమునన్ = ఆదరింపమిని.
  3. పరుసఁదనము = గడుసుదనము, బెరుకు = భేదము, ప్రల్లదంబు = దుష్టత్వము, గృహికిన్ = గృహస్థునకు.
  4. కంటు = నిరోధము, శోభనధామంబులు = శుభస్థానములు, అరిష్టవిరామములు = కీడులను పోగొట్టునవి.
  5. ఖేలనవృత్తిన్ = క్రీడావ్యాపారములచేత, తపశ్చరణ = తపస్సు చేయుటయొక్క.