పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ధాత్రీశ వినుము విప్ర, క్షత్రియవిట్ఛూద్రజాతిజనులు నిజాచా
రత్రాణపరత నడిపిన, స్తోత్రారాధనల శౌరి తుష్టుఁ డగుఁ జుమీ.[1]

136


వ.

అనిన నమ్మహీపతి యతని నవలోకించి మహాత్మా వర్ణాశ్రమధర్మంబు లెఱుంగ
వలయు నానతి మ్మనిన నౌర్వుం డిట్లనియె.

137

వర్ణాశ్రమధర్మాద్యభివర్ణనము

సీ.

ఉచితజ్ఞుఁడై దాన మొసఁగుచు దేవార్చనాశీలుఁడై కరుణంబు గలిగి
యగ్నిపరిగ్రహుం డగుచు నిరంతరస్వాధ్యాయతత్పరుండై కుటుంబ
వృత్త్యర్థయజనంబు వేదవిక్రయమును మాని శుక్లముఁ గొని దాన మొరుల
వలనఁ గైకొనక సర్వప్రాణులకు హితకారియై మైత్రియు గౌరవంబు


తే.

మనుజులకు నెల్లఁ జేయుచు మణియు శిలయుఁ, దనకు సరియకాఁ జూచుచు ధర్మపత్ని
నొనర ఋతుకాలములయందె యనుభవించి, నియతుఁడై యుండు టది విప్రునికి మతంబు.[2]

138


సీ.

క్రతువులు సేయుట శ్రుతు లభ్యసించుట దానంబు లొసఁగుట ధర్మి యగుట
శస్త్రజీవికయు భూచక్రరక్షణమును మఱవకుండుట వేద నెఱిఁగి తగిన
భంగిఁ బ్రోచుట పరబాధలు లేకుండఁ బ్రజల రక్షించుట బ్రాహ్మణులకు
భక్తిఁ గావించుట పాపకర్ముల వధించుట శిష్టజనులఁ బ్రోచుట త్రివర్గ


తే.

పరత నేమఱకుండుట పార్థివునకుఁ, బరమధర్మంబు లగు నిట్లు బ్రతికెనేని

  1. నిజాచారత్రాణపరతన్ = తమనడవడిని కాపాడుకొనుటయందు ఆసక్తిగలవా రగుటచేత, తుష్టుఁడు = సంతోషించినవాఁడు.
  2. వృత్త్యర్థయజనంబున్ = జీవనార్ధమైనయజ్ఞము చేయుటను - యజ్ఞము చేయు నెపము పెట్టి ధన మార్జించుట, వేదవిక్రయమును = జీతము నిర్ణయించుకొని వేదము చెప్పుటను, సంస్కృతమునందు శ్లో. "వృత్త్యర్థం యాజయేచ్చాన్యాసన్యానధ్యావయేత్తథా, పర్యాత్ప్రతిగ్రహాదానం శుక్లార్థాన్న్యాయతో ద్విజః.” అని యాజనాధ్యాపనప్రతిగ్రహములు బ్రాహ్మణులకు ముఖ్యవృత్తులుగాఁ జెప్పఁబడియుండుటవలన ఇచ్చట (వృత్త్యర్థయజనంబు వేదవిక్రయమును మాని) అనుచో యజ్ఞము చేయునెపంబున ధన మార్జించుటయు, జీతము నిర్ణయించుకొని వేదముఁ జెప్పుటయును అని అర్థము వ్రాయఁబడెను. కాబట్టి జీవనార్థమై యాజనాధ్యాపనములు చేసి శాస్త్రసమ్మతముగా వచ్చినదక్షిణాదులఁ బ్రతిగ్రహించవచ్చునని భావము. శుక్లమున్ = స్వవృత్తిచే ధన మార్జించునట్టి విప్రాదులవలని పరిశుద్ధద్రవ్యమును, ఈశుక్లశబ్దార్థమును."క్రమాగతం ప్రీతిదాయం ప్రాప్తంచ సహభార్యయా, అవిశేషేణ సర్వేషాం ధనం శుక్ల ముదాహృతమ్.” అని విష్ణువును, శ్లో."శ్రుతశౌర్యతపఃకన్యాయాజ్యశిష్యాన్వయాగతం, ధనం సప్తవిధం శుక్లం." అని నారదుఁడును వివరించి యున్నారు. హితకారి = మేలు చేయువాఁడు, మతంబు = ధర్మము.