పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గావున వారు లోకములకంటెను మాన్యులు ధన్యు లెంతయున్.[1]

111


చ.

నలినదళాక్షురాజసగుణంబునఁ బుట్టినతమ్మిచూలికిన్
దలవరివాఁడనై తగినదండనముల్ గడుఁ జేయునాకు ను
జ్జ్వలమహిమాఢ్యులై వెలయు వైష్ణవు లెల్ల నజేయు లట్టివా
రలదెస వోకుమీ బ్రతుకుఁ బ్రాణములున్ వలతేని కింకరా.[2]

112

వైష్ణవలక్షణము

చ.

అనుటయుఁ గింకరుండు జలజాప్తతనూజునిఁ జూచి దేవ యా
వనరుహనాభుభక్తజనవర్గము వేషము వారిశీలవ
ర్తనములు వారిచర్యలును వారిగుణంబులు నానతీఁగదే
యనుటయు నమ్ముహాభటున కంతకుఁ డిట్లని పల్కెఁ బెంపుతోన్.[3]

113


ఆ.

శత్రుమిత్రులందు సమబుద్ధియై నిజా, చారవర్తనములవలన మెలఁగి
యల్పమైన నధికమైనఁ బరద్రవ్య, వాంఛ లేనివాఁడె వైష్ణవుండు.

114


తే.

పసిఁడియైనను దృణమైనఁ బరులసొమ్ము, ఏకతంబునఁ దన
కబ్బెనేనిఁ గొనక
యధికశుద్ధాత్ముఁడై యుండు నాశలేక, వాఁడె లోకోత్తరుం డైనవైష్ణవుండు.[4]

115


క.

తనకుఁ గలికలుష మొదవిన, మనసున దుఃఖంబు లేక మధుసూదనుపైఁ
గొనకొన్నభక్తి వదలని, మనుజుఁడెపో విష్ణుభక్తిమహితుఁడు జగతిన్.[5]

116


తే.

స్ఫటికశైలశిలామలోద్భాసి వాసు, దేవుఁ డెక్కడ మత్సరాధీనమలిను
లైనమానవు లెక్కడ యమృతకిరణు, తుహినరశ్మిమధ్యంబున దహనునట్ల.[6]

117


వ.

అని విచారింపుము.

118


తే.

అమలహృదయవిమత్సరులై ప్రశాంతు, లై సమస్తభూతంబులయందు మిత్రు

  1. చేవ = సత్త, లోకములకంటెన్ = ఎల్లలోకములకంటెను, మాన్యులు = గౌరవింపఁదగినవారు, ధన్యులు = కృతార్థులు.
  2. తమ్మిచూలికి = బ్రహ్మకు, తలవరివాఁడను = బంటను, ఉజ్జ్వలమహిమాఢ్యులు = మిక్కిలి ప్రకాశించునట్టి మహిమగలవారు, వలతేని = అపేక్షించువాఁడవైతివేని.
  3. జలజాప్తతనూజున్ = సూర్యునికొడుకును - యముని, శీలవర్తనములు = మంచియాచారములు, చర్యలు = చేష్టలు, అంతకుఁడు - యముఁడు.
  4. పసిండి = బంగారు, ఏకతంబునన్ = ఏకాంతమునందు - సొమ్ముగలవారు ఎదుటలేనియెడ, అబ్బెనేని = దొరకినపక్షమున, కొనక = తీసికొనక, అధికశుద్ధాత్ముఁడు = మిక్కిలి పరిశుద్ధమైన మనసుగలవాఁడు, లోకోత్తరుండు = ఎల్లలోకులకును ఆవలివాఁడు - అందఱియందును ముఖ్యుడు.
  5. కలుషము = పాపము, కొనకొన్న = తుదముట్టిన - అతిశయించిన, మహితుఁడు = పూజ్యుఁడు.
  6. స్ఫటికశైలశిలామలోద్భాసి = పటికపుకొండయందలి రాళ్ళవలె స్వచ్ఛముగా ప్రకాశించువాఁడు, మత్సరాధీనమలినులు = విడువనివిరోధమునకు అధీనులగుటచే ప్రకాశహీనులైనవారు, అమృతకిరణుతుహినరశ్మిమధ్యంబునన్ = చంద్రుని చల్లనికిరణములనడుమ, దహనునట్ల = అగ్నిహోత్రునివలెనే.