పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్వీకార యొకరహస్యము, గైకొని చెప్పంగవలయుఁ గరుణాదృష్టిన్.[1]

103

యమయాతనానివృత్త్యుపాయమును దెలుపుట

సీ.

పాతాళలోకసప్తకము సప్తద్వీపములు సప్తసాగరములును సప్త
లోకంబులును మొదలుగఁ గల బ్రహ్మాండభాండమధ్యంబున నిండియున్న
స్థూలరూపంబులు సూక్ష్మరూపంబులు స్థూలంబులకు నతిస్థూలములును
సూక్ష్మంబునకు నతిసూక్ష్మమై చెలువొందు ప్రాణికోటులచేతఁ బట్టు చాల


తే.

కున్న యది కర్మబంధనియుక్తిఁ బరఁగు, జంతువులు దండధరుచేతఁ జచ్చి తీవ్ర
వేదనలఁ గుందుచుందురు వీర లధిక, దుఃఖములఁ బొందకుండెడుత్రోవ గలదె.[2]

104


క.

అనవుడుఁ బరాశరుం డి, ట్లనుఁ దొల్లి మహానుభావుఁ డగుకాళింగుం
డనుమౌని నాకు నెంతయు, వినయంబున సేవ చేసి వేడుకతోడన్.

105


ఆ.

అధికభక్తి నున్నయతనికి జాతిస్మ, రత్వ మొసఁగి ధర్మరతునిఁ జేసి
యున్న యతఁడు నాకు నొక్కనాఁ డేకాంత, వేళ నధికభక్తి వినతిచేసి.[3]

106


క.

ఇప్పుడు నను నీ వడిగిన, చొప్పున నేతద్రహస్యసూక్ష్మంబులు వా
తప్పక ప్రశ్న మొనర్చినఁ, జెప్పితి విను తత్కథావిశేషము లనఘా.[4]

107


వ.

తొల్లి నకులుం డనుమహాముని యమకింకరభయంకరం బైననరకలోకంబున
నత్యంతదుఃఖీభూతులై యున్న ప్రాణులం జూచి వగచుచుఁ బితామహుపాలికిం
జని నీవు నన్నడిగినయట్ల యడిగిన నతనితోడ యమకింకరసంవాదం బను
నొక్కకథ గలదు వినుమని యిట్లనియె.

108


ఆ.

యమునిచే నియుక్తులై కింకరులు పాశ, దండహస్తు లగుచు దండితోడ
నొప్పుఁ దప్పు నరసి యుర్విలోఁ బ్రాణులఁ, బట్టి తెచ్చుటకును బైనమైన.[5]

109


తే.

యముఁడు కింకరవరుని డాయంగఁ బిల్చి, వానికర్ణములందు నెవ్వరు నెఱుంగ
కుండ నేకాంతమునఁ గొన్ని యుగ్గడించి, పనిచె నావచనంబు లేర్పడఁగ వినుము.[6]

110

యముండు తనకింకరులకు వైష్ణవమాహాత్మ్యమును దెలుపుట

ఉ.

నీవు మహీతలంబునకు నేగి ముకుందునిమీఁది భక్తిచేఁ
జేవ వహించి యున్నగుణశీలురుఁ దెచ్చెదు సుమ్ము వైష్ణవుల్
పావను లమ్మహాత్ములకుఁ బాపము లెన్నఁడుఁ జెంద వెమ్మెయిన్

  1. సుగుణస్వీకార = మంచిగుణమును వహించినవాఁడా.
  2. చెలువొందు = ఒప్పు, పట్టు = స్థానము.
  3. జాతిస్మరత్వము = పూర్వజన్మమునం దిట్టివాఁడనై యుంటిని అనుజ్ఞానము కలిగియుండుట, ధర్మరతునిన్ = ధర్మమునం దాసక్తునిఁగా, వినతి = నమస్కారము.
  4. ఏతద్రహస్యసూక్ష్మములు = ఈరహస్యమైన సూక్ష్మవిషయములను, వాతప్పక = మాటపొరపాటులేక.
  5. పాశదండహస్తులు = త్రాళ్లు కఱ్ఱలు చేతఁ బట్టినవారు, దండితోడన్ = గంభీరత్వముతో.
  6. కింకరవరునిన్ = కింకరులలో ముఖ్యుని, ఉగ్గడించి = చెప్పి, పనిచెన్ = పంపెను.