పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వెలయం జెప్పెద సావధానమతితో విన్నంత విప్రోత్తమా.[1]

66


ఉ.

తేజములు వివేకములు ధీరతలున్ గడునల్పముల్ గదా
భూజనకోటికంచుఁ దలపోసి తదీయహితార్థకారియై
యాజలజాముఁ డేకవిధమై కడగానఁగరానివేదముల్
నైజముగా నొనర్చె మును నాలుగుభేదములై వెలుంగఁగన్.[2]

67


వ.

ఆనాలుగువేదంబులకును ఋగ్యజుస్సామాధర్వణంబులను సంజ్ఞలు చేసి సాంప్ర
తంబయిన వైవస్వతమన్వంతరంబున నతీతంబు లైనయష్టావింశతిమహాయుగం
బులం గలద్వాపరంబులయందుఁ గ్రామంబున బ్రహ్మయుఁ బ్రజాపతియు శుక్రుం
డును బృహస్పతియును సూర్యుండును మృత్యువును దేవేంద్రుండును వసిష్ఠుం
డును సారస్వతుండును ద్రిధాముండును ద్రివృషుండును భరద్వాజుండును
నంతరిక్షుండును ధర్ముండును ద్రయ్యారుణియును ధనంజయుండును గృతంజ
యుండును సంజయుండును భరద్వాజుండును గౌతముండును ఉత్తముండును[3]
వాజిశ్రవుండును సోమశుష్మాయణుం డనుతృణబిందుండును వాల్మీకియు మజ్జన
కుం డైనశక్తియును నేనును జాతుకర్ణుండును మత్పుత్రుం డైనకృష్ణద్వైపాయ
నుండును వేదవ్యాసరూపంబులు ధరియించి వేదవేదాంగధర్మశాస్త్రపురాణాగ
మంబులు మొదలుగాఁ బదునెనిమిదివిద్యలు జగంబులం బ్రసిద్ధంబు చేసితిమి.
ద్రోణపుత్రుండైనయశ్వత్థామ ముందరిద్వాపరయుగంబున వేదవ్యాసుండు గాఁ
గలవాఁ డివ్విధంబున నానామన్వంతరంబులయందునుం గలనానాద్వాపరంబుల
నొక్కొక్కమహాత్ముండు వైష్ణవాంశంబున వేదవ్యాసుండై వేదంబు లుద్ధరించు
నని చెప్పి మఱియు నిట్లనియె.[4]

68


క.

వేదంబు తొల్లి నాలుగు, పాదంబులతో సహస్రభావమ్ముగ సం
పాదించి రంబుజాతభ, వాదులు వ్యాసస్వరూపులై క్రతువులకున్.[5]

69


క.

నాపుత్రుఁ డైనకృష్ణ, ద్వైపాయనమౌని వైష్ణవం బగుమహిమన్
దీపించెఁ గాకయుండిన, నీపాటికవిత్వరచన నెవ్వఁడు నేర్చున్.

70


వ.

తొల్లి వల్మీకసంభవుం డైనవాల్మీకి బ్రహ్మచేత నియుక్తుండై రామాయణం బేడు
కాండంబులు నేనూఱుసర్గలు నిరువదినాలుగువేలల్లో కంబులుగాఁ చేర్చి కావ్యం
బు చేసె నతనియట్ల కృష్ణద్వైపాయనుండును మహాభారతంబు హరివంశయుక్తం
బుగా నూఱుపర్వంబులు సపాదలక్షగ్రంథంబునుగాఁ జేసి జగంబులఁ బ్రసిద్ధంబు
గావించె. ఆవ్యాసవాల్మీకు లిరువురు నాదికవీంద్రు లైరి వారియందు.[6]

71
  1. చలితాఘంబు = చలించిన పాపముగలది - పాపహరము, భూజము = వృక్షము, విపక్షింపన్ = విశదవఱువ, వెలయన్ = ప్రసిద్ధముగా.
  2. హితార్థకారి = మేలైన ప్రయోజనమును చేయువాఁడు, నైజముగాన్ = స్వభావముగా.
  3. ఇతనికి హర్యాత్ముఁడు అని నామాంతరము.
  4. సంజ్ఞలు = గుఱుతులు - పేరులు, సాంప్రతంబు = ఇప్పుడు జరుగునది, అతీతంబులు = కడచినవి.
  5. అంబుజాతభవాదులు = బ్రహ్మ మొదలగువారు.
  6. వల్మీకసంభవుండు = పుట్టయందుఁ బుట్టినవాఁడు, నియుక్తుండు = నియోగింపఁబడినవాఁడు.