పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు చతుర్దశమన్వంతరంబులును మనుసంధికాలంబులునుంగూడ సహస్రదివ్య
యుగంబులై పితామహదివసం బగునప్పుడు నిశ్శేషకల్పంబై యుండుఁ దావ
త్ప్రమాణకాలంబై నిశాసమయంబునుం జెల్లుఁ బరమేశ్వరుండు బ్రహ్మరూప
ధరుండై మహార్ణవంబున శేషపర్యంకంబున నిజమాయామోహంబున సకలలో
కభూతంబులను సంగ్రహించినవిశేషంబగుమహత్త్వంబున యోగనిద్ర నొంది
ప్రభాతసమయంబున మేలుకొని రాజసగుణోద్రిక్తుండై సృష్టి గావించు నిట్లు
నానాకల్పంబులు ననల్పప్రకారంబున నిర్మించు మఱియును.[1]

58


క.

మనువులు మనువులసుతులును, మునులు సుపర్వులు సురేంద్రముఖ్యులు నబ్జా
క్షునిసాత్వికగుణసంవ, ర్ధనులై పాలింతు రతిముదంబున జగముల్.[2]

59


క.

ఆదియుగకాలమునఁ గపి, లాదులరూపములు దాల్చి యఖిలమునకు దా
మోదరుఁ డతులజ్ఞానం, బాదేశించుచు వెలింగె నతులప్రీతిన్.[3]

60


తే.

చక్రవర్తిరూపంబులఁ జక్రధరుఁడు, తొడరి త్రేతాయుగంబున దుష్టశిక్ష
ణంబు గావించి శిష్టలోకంబునెల్ల, లీల ధర్మంబు మెఱయఁ బాలించుచుండు.[4]

61


క.

ఆదేవుఁడు ద్వాపరమున, వేదవ్యాసత్వమునఁ బ్రవీణతతోడన్
వేదంబు లుద్ధరించు స, మాదరమునఁ బెక్కుశాఖలై విలసిల్లన్.

62


ఆ.

కలియుగంబునందు గమలాయతాక్షుండు, కలికిరూపమున జగంబునందు
వేదశాస్త్రమార్గవితతులు చెడకుండ, సరయుచుండుఁ గరుణ బెరయుచుండ.[5]

63


వ.

ఇట్లు భూతభవిష్యద్వర్తమానకాలాత్ముం డైన యమ్మహాత్మునియధీనంబై సమస్తం
బు విస్తరిల్లు నని చెప్పిన విని మైత్రేయుం డిట్లనియె.

64

వ్యాసకృతవేదవిభాగాదిక్రమము

సీ.

ధరణీధరుండు వేదవ్యాసరూపంబు దానె గైకొని ప్రతిద్వాపరమున
వేదంబులను మఱి వేదశాఖాసహస్రంబును మఱి ధర్మశాస్త్రములఁ బ్ర
తిష్ఠించునని చెప్పితివి యతీతము లైనయేయేయుగంబుల నెవ్వరెవ్వ
రనఘ వేదవ్యాసు లైరి వా రెట్టెట్టివిధముల వేదముల్ విస్తరించి


తే.

చదివి రీవేదముల కెన్నిశాఖలుగ నొ, నర్చి రెబ్భంగి దీపించినారు చెప్పు
నాకు ననుటయు వాసిష్ఠనందనుండు, పలికె మైత్రేయసంయమిప్రవరునకును.[6]

65


మ.

చలితాఘం బగువేదభూజమునకున్ శాఖోపశాఖాచయం
బులు పెక్కుల్ గల వన్నియుం బ్రకటితంబు ల్గా వివక్షింప నా
జలజాతాననుఁడైన నోపఁ డిపు డే సంక్షేపరూపంబుగా

  1. నిశ్శేషకల్పంబు = మిగులు లేనిదిగా లయము నొందినది, పర్యంకంబు = శయ్య, ప్రభాత సమయంబునన్ = వేగుజామున, అనల్పప్రకారంబునన్ = అల్పముకానివిధమున.
  2. సంవర్ధనులు = చక్కగా వృద్ధిపొందినవారు.
  3. ఆదేశించుచున్ = ఉపదేశించుచు.
  4. తొడరి = పూని, లీలన్ = విలాసముగా.
  5. బెరయు = ప్రసరించు.
  6. ధరణీధరుండు = విష్ణువు.