పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఛాయాసంజ్ఞలు గాంచిరి, తోయజవనబంధునికి సుతున్ సావర్ణిన్
ధీయుతునిఁ బూర్వతనయ, ప్రాయమహితు సుజనలోకపావనమూర్తిన్.[1]

42


వ.

అట్టిసావర్ణితపోమహత్వంబునను విష్ణు ప్రసాదంబునను మన్వంతరపట్టంబునకుఁ
దపంబు సేయుచున్నవాడు రసాతలంబునకుం బతి యైనవిరోచనకుమారుం
డగుబలీంద్రుం డింద్రపదంబుఁ గోరి వాసుదేవు నారాధించుచున్నవాఁడు సుత
పాదివింశతిగణంబులు దేవత్వంబునకుఁ దపంబు సేయుచున్నవారు గాలవుం
డును దీప్తిమంతుండును బరశురాముండును గృపాచార్యుండు నశ్వత్థామయుఁ
గృష్ణద్వైపాయనుండును ఋష్యశృంగుండును ననువారు సప్తమహర్షులు నిర్మో
హవీరబాహు లైనరాజులు సావర్ణినందనులుగాఁ గలవార లి ట్లమ్మన్వంతరంబు
చనినపిదప.

43


సీ.

మఱి దక్షసావర్ణిమన్వంతరమున మహావీర్యుఁ డనువాఁడు దేవవిభుఁడు
ధారామరీచిసుధర్మగర్భాదులు ద్వాదశగణదేవతలును సవనుఁ
డును భవ్యుఁడును ధర్ముఁడును ద్యుతిమంతుండు దీప్తియు మేధుండు దీపకుండు
జ్యోతిష్మతియు నన నొనరినసంయము లేడ్వురు సప్తమునీంద్రు లైరి


తే.

దివ్యకేతు మహాకేతు దీప్తికేతు, పంచహస్తనిరామయప్రముఖు లైన
మనుజనాథులు పెక్కండ్రు మనువుసుతులు, ఘనులుగా నున్నవారు జగంబునందు.[2]

44


తే.

బ్రహ్మసావర్ణిమన్వంతరంబురందు, శాంతి యనువాఁడు దేవతాచక్రవర్తి
సుఖసుఖాత్మసుధర్మాదిసురలు నూర్వు, రందు దేవపదంబుల నందఁగలరు.[3]

45


తే.

సత్యుఁ డనఁగ నాభాగుఁడు సంస్తుతి యన, సత్యకేత ప్రతిమహరిష్మంతు లనఁ ద
పోధనుండును ననువారు పుణ్యఘనులు, సప్తమునులు గాఁగలవారు సంయమీంద్ర.

46


వ.

సుక్షేత్రభూనిషేణాదు లైనరాజులు పదుండ్రు బ్రహ్మసావర్ణిపుత్రులై మేదినీ
తలంబు రక్షింపంగలవారు మఱియును.[4]

47


తే.

పదునొకండవమనువు భూవిదితకీర్తి, విష్ణుసావర్ణి యను వేర వెలయు నతని
యంతరంబునఁ బృషుఁ డందు రమరవిభుఁడు, విహగకారుగమాదులు విబుధగణము.[5]

48
  1. తోయజవనబంధునికిన్ = కమలములపఙ్క్తులకు మిత్రుఁడైన సూర్యునివలన, పూర్వతనయప్రాయమహితున్ = మునుపటికొడుకులను బోలినమహిమగలవానిని.
  2. సంయములు =ఋషులు.
  3. దేవతాచక్రవర్తి = దేవరాజు - ఇంద్రుఁడు.
  4. పదుండ్రు = పదిమంది.
  5. భూవిదితకీర్తి = భూమియందు ప్రసిద్ధమైన యశస్సుగలవాఁడు.