శ్రీవిష్ణుపురాణము
చతుర్థాశ్వాసము
|
మత్సకలపురాణక
థామధురసుధానుభవబుధవ్రతనుత సం
గ్రామధనంజయ జగదభి
రామవపుఃపుష్పచాప రాఘవభూపా.[1]
| 1
|
వ. |
సకలపురాణవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయున కిట్లనియె. ఇట్లు
నావలన భూవిస్తారంబును సముద్రవర్ణితంబులును సూర్యాదినవగ్రహస్థానంబు
లును జ్యోతిశ్చక్రప్రభావంబును దేవర్షికీర్తనంబును జాతుర్వర్ణ్యోత్పత్తియును
దిర్యగ్యోనిజన్మంబులును ధ్రువప్రహ్లాదచరిత్రంబులును వింటి వింక నేమి వినవల
యునని యడిగిన నతం డిట్లనియె.[2]
| 2
|
క. |
మునివర మన్వంతరముల, మనుపుత్రుల సురల సప్తమౌనుల దేవేం
ద్రనికాయంబుల నేర్పడ, వినవలతుం జెప్పవే సవిస్తరఫణితిన్.
| 3
|
మన్వంతరమనుపుత్రాదివివరణము
వ. |
అని యడిగిన పరాశరుం డిట్లను నతీతానాగతంబు లైనచతుర్దశమన్వంతరంబులం
జెప్పెద స్వాయంభువస్వారోచిషోత్తమతామసరైవతచాక్షుషమన్వంతరంబు
లాఱును గడచనియె. వైవస్వతమన్వంతరంబు వర్తమానంబై నడుచుచున్న
యది. కల్పాదికథలవలన స్వాయంభువమన్వంతరప్రకారంబు వింటి వింక స్వారో
చిషమన్వంతరంబుఁ జెప్పెద వినుము.
| 4
|
క. |
స్వారోచిషాంతరమునఁ, బారావతతుషితముఖసుపర్వగణము లే
పారువిపశ్చిత్తుం డను, స్వారాజు వెలుంగు లోకసన్నుతమహిమన్.[3]
| 5
|
తే. |
ప్రాణవాతాగ్నివృషనిస్వరాహ్వయులును, స్తంబకుండును మఱియు నూర్జకుఁ డనంగ
|
|
- ↑ జగదభిరామవపుఃపుష్పచాప = లోకమునందు మనోజ్ఞమైనశరీరముచేత మన్మథుఁడైనవాఁడా.
- ↑ చాతుర్వర్ణ్యోత్పత్తి = బ్రాహ్మణవర్ణము మొదలుగాఁగల నాలుగువర్ణముల సముదాయముయొక్క పుట్టుక, తిర్యగ్యోనిజన్మంబులు = పశుపక్ష్యాదులపుట్టుకలు.
- ↑ స్వారాజు = ఇంద్రుడు.