పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విమలశుభవిధేయా వీరకేళాదిరాయా
ప్రముదితసుకవీంద్రా పంటవంశాబ్దిచంద్రా.[1]

386


గద్యము.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనవిధేయ
వెన్నెలగంటి సూరయనామధేయ ప్రణీతం బైన యాదిమహాపురాణంబగు
బ్రహ్మాండంబునందలి పరాశరసంహితయైన శ్రీవిష్ణుపురాణంబునందుఁ బ్రియవ్రతు
వంశంబును సప్తసాగరసప్తద్వీపప్రకారంబులును బేతాళనరకలోకకీర్తనంబు
లును భూర్భువాదిలోకవర్ణనంబులును జ్యోతిశ్చక్రక్రమంబును జడభరతో
పాఖ్యానంబును నన్నది తృతీయాశ్వాసము.

——

  1. సమరపరశురామా = యుద్ధమునందు పరశురామునిఁ బోలినవాఁడా, చారుసౌభాగ్యధామా = మనోజ్ఞమైన చక్కఁదనమునకు ఉనికిపట్టయినవాఁడా, సముదరిపువికీర్ణా = మదముతోఁ గూడుకొన్న శత్రువులను చెదరగొట్టువాఁడా, శౌర్యవిద్యాసుపర్ణా = శూరత్వమనెడు విద్యయందు గరుత్మంతునిఁ బోలినవాఁడా, విమలశుభవిధేయా = నిర్మలమైన క్షేమమునకు విధేయుఁడవైనవాఁడా, ప్రముదితసుకవీంద్రా = మిక్కిలి సంతోషింపఁజేయఁబడిన సత్కవిశ్రేష్ఠులు గలవాఁడా.