పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బై కల్యాణవిహారమై నిబిడమాయాతీతమై నిర్గుణం
బై కైవల్యవిహారమై జనననాశాతీతమై యుత్తమ
శ్లోకంబై పరమార్థతత్త్వము నటించున్ నిత్యశుద్ధస్థితిన్.[1]

337


సీ.

విను నామజాత్యాదులును యోగవిషయంబులును మహాధ్యానంబులును స్వదేహ
పరదేహభేదసంపాదకంబులు లేక యేస్వరూపమై యెపుడు నుండు
నద్వైతరూపమై యమరినపరమాత్మునికి విశేషజ్ఞాననిశ్చయంబు
రూపమై వెలుఁగొందు నాపురుషుఁడు భేదవృత్తిమై నొక్కొక్కవేళ నుండు


తే.

నిల నభేదస్వరూపతఁ బొలుచు గాలి, వేణురంధ్రంబులను జెంది వివిధగతుల
షడ్జముఖ్యస్వరంబుల సంజ్ఞ లమరుఁ, దనకు భేదంబు లేదు యథాస్థితులను.[2]

338


వ.

కావున బ్రహ్మాదిభేదరూపంబులు పరమాత్మునికంటె నన్యంబులు గావు. ఏకపదా
ర్థంబులకు రూపభేదంబులు బాహ్యాభ్యంతరవృత్తులవలనం గలుగు దేవాది
భేదంబు లేక సకలంబు నేకస్వరూపంబై యుండుం గాని పరమాత్మునికి
భేదంబు లేదని చెప్పిన రాజు చింతాపరుండై తెలియక యూరకుండిన.[3]

339

ఋభుమహర్షి నిజాఘునకు తత్త్వోపదేశంబు సేయుట

క.

ఆవసుధామరుఁ డానృపు, భావం బద్వైతవృత్తిఁ బాటిలకున్నన్
భావించి తదీయరహ, స్యావహముగ నొక్కచిదితిహాసము చెప్పెన్.[4]

340


చ.

వినుము నరేంద్ర తొల్లి యరవిందభవాత్మతనూజుఁడై ఋభుం
డనుమునిపుంగవుం డందయమై కడుబాల్యమునందు బ్రహ్మత
త్త్వనిరతి నుల్లసిల్లుచు నిదాఘుఁ డనంగఁ బులస్త్యమౌనినం
దనుఁ దనశిష్యుఁగా నతిముదంబునఁ జేకొని ప్రీతచిత్తుఁడై.

341


తే.

ఒక్క యద్వైతవాసన దక్క సకల, మైనసుజ్ఞానమును జెప్పి యతికృతార్థుఁ
జేసెఁ బౌలస్త్యుఁడును గురుశాసనమున, నరిగి గృహమేధిధర్మంబు లలవరించి.[5]

342


తే.

దేవికాఖ్యమహానదీతీరభూమి, నాపులస్త్యనివేదితం బైనవీర
నగరబాహ్యోపవనములోనను గృహస్థ, ధర్తములు మాన కాలును దాను నుండె.

343


వ.

అంత దివ్యవర్షసహస్రంబునకు ఋభుండు శిష్యున కద్వైతవాసన యుపదేశించు
వాఁడై వచ్చె నప్పుడు.

344
  1. ఏకవ్యాపకము = ఒక్కటైనది - వ్యాపించునది, హేవాకము = దేదీప్యమానప్రౌఢరీతి గలది, శ్రీకరంబు = సంపత్కరమైనది, కళ్యాణవిహారము = శుభకరమైన విహరించుట గలది, నిబిడమాయాతీరము = అంతట వ్యాపించియుండు మాయను కడచినది, నిర్గుణంబు = రజస్పత్వతమస్సులనెడు మూఁడుగుణములును లేనిది, కైవల్యవిహారము = పరమపదమునందలి విహారముగలది, అతీతము = కడచినది, ఉత్తమశ్లోకంబు = మేలైనకీర్తిగలది, నటించున్ = వర్తించును, నిత్యశుద్ధస్థితిన్ =శాశ్వతమై నిర్మలమైన యునికితో.
  2. వేణువు = పిల్లనగ్రోవి.
  3. బాహ్యాభ్యంతర = వెలుపలను లోపలను, చింతాపరుండు = విచారగ్రస్తుఁడు.
  4. పాటిలక = పొందక, చిదితిహాసము = జ్ఞానబోధకమైన పూర్వకథను.
  5. శాసనమునన్ = ఆజ్ఞ చేత, గృహమేధిధర్మములు = గృహస్థునినడవళ్లను.