పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

వెలయఁగ ధర్మాధర్మం, బులు రెండును నధికసౌఖ్యమును దుఃఖంబున్
గలిగించు దేశకాలం, బులవలనను జంతువులకు భూవరముఖ్యా!

304


క.

ధర ధర్మాధర్మంబులు, నరునకు నుపభోగకారణంబులు ధరణీ
వర ప్రాణికి నాగమన, స్ఫురణప్రయోజనము కొఱకె పో తలపోయన్.[1]

305


వ.

అనిన నమ్మహీవిభుండు.

306


తే.

నీవు చెప్పినవన్నియు నిశ్చయార్థ, యుక్తు లగు సోహ మను మాట యొక్కటియును
జెప్ప శక్యంబు గాదని యిప్పు డాన, తిచ్చి తది యెట్లు చెప్పవే యిద్ధచరిత.[2]

307


క.

భూదేవ సోహ మనుపలు, కేదే నొకవస్తువందు నెమ్మెయిఁ జెప్పన్
రాదో యాత్మను జెప్పన్, రాదో యెఱిఁగింపు మనిన బ్రాహ్మణుఁ డనియెన్.[3]

308


క.

నరనాథ సోహ మనుపలు, కిరువొందఁగ నాత్మయందు నేఁ జెప్పఁదగున్
ధర దేహాదులయందును, బరమాత్మునిఁ జెప్పుటెల్ల భ్రాంతులు సుమ్మీ.[4]

309


వ.

జిహ్వతాల్వధరోష్ఠపుటవ్యాపారంబులచేత నీశబ్దం బుచ్చరింపంబడుంగాని
యహ మనుశబ్దంబు విషయభూతంబు గాదు గావునఁ దాల్వాదులు సోహ
మనుశబ్దంబునకు స్వరూపంబులు గావు కరచరణమస్తకోదరాదులు గలశరీరం
బాత్మ యని నిరూపించుట వివేకంబు గాదు.[5]

310


క.

నీకును నాకును దక్కిన, లోకులకును బరముఁడై త్రిలోకంబులయం
దేకాకారుం డగుసు,శ్లోకుఁడు గోచరుఁడు రాజ సోహ మనుటకున్.

311


చ.

భువనములం దఖండపరిపూర్ణమహత్వముతోడ నేకమై
యవిరళవృత్తి నున్న పరమాత్మునిఁ గాదని బాహుమస్తకా
ద్యవయవయుక్తదేహములయందును సోహ మటంచు ధారుణీ
ధవ పలుకంగఁ గోరుట వృథా యగు నిత్యవివేకశాలికిన్.[6]

312


ఆ.

ధరణినాథ శిబిక దారువో వృక్షమో, యెఱిఁగికొనుము దారువేని ప్రజలు
నిన్ను దారు వెక్కి యున్నాఁ డనరు వృక్ష, మైన వృక్ష మెక్కె ననరు సువ్వె.[7]

313


క.

దారుసమూహంబులచే, నీరీతి నొనర్పఁబడినయిది శిబిక యనన్
బేరు వహించెను నిను శిబి, కారూఢుం డనుచుఁ జెప్ప నగు మనుజులచేన్.

314


క.

ధరగలచరాచరంబుల, సరవిన్ భేదములు లోకసంజ్ఞార్థములై

  1. ఉపభోగకారణంబులు = అనుభవించుటకు నిమిత్తములు, ఆగమనస్ఫురణ = వచ్చుటయొక్క తోఁపిక.
  2. ఇద్ధచరిత = మేలైననడవడి గలవాఁడా.
  3. ఎమ్మెయిన్ = ఏవిధముచేతను.
  4. ఇరువొందఁగన్ = స్థిరముగా, ఆత్మయందునేన్ = ఆత్మయం దయినయెడ.
  5. జిహ్వా.. వ్యాపారంబులచేతన్ = నాలుక దవుడ పెదవులు వీనియొక్క వ్యాపారములచేత.
  6. అవిరళవృత్తిన్ = చేరికగలయునికిచేత, ముక్త = విడువబడిన.
  7. దారువు = కొయ్య.