పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిన్ను నన్నును దక్కిననిఖిలజంతు, వులఁ బృథివ్యాది యగుభూతములు వహించు.[1]

292


ఆ.

క్షితిగుణప్రవాహపతితమై యీభూత, పంచకంబు మెఱయుఁ బార్థివేంద్ర
సాత్వికాదు లైనసకలగుణంబులు, బహుళకర్మవశతఁ బరఁగుచుండు.[2]

293


ఆ.

అట్టికర్మచయము లఖిలజంతువులందుఁ, గానఁబడు నవిద్యకలిమిఁ జేసి
యాత్మమాయఁ బొరయ దక్షరం బతిశాంత, మగుచు గుణములందుఁ దగులకుండు.[3]

294


క.

హానియు వృద్ధియు దేహా, ధీనంబులు గాని వసుమతీవర యాత్యా
ధీనములు గావు గావున, నేనేర్పునఁ బీవరుండ వీవంటి ననున్.

295


వ.

ఈచెప్పినభూపాదజంఘాకట్యూరుజఘనోదరవక్షోభుజంబులచేత భరియింపంబడి
న యీశిబికాభారంబు నాకుఁ గల్గెనేని నీకుం గల్గుట తెల్లంబు.[4]

296


క.

తక్కక నీవును నేనుం, దక్కినభూతములు శిబిక ధరియింపఁగ నా
కొక్కనికి భార మగునని, యక్కజముగఁ జెప్పి తెట్టు లది తెలియదొకో.[5]

297


క.

విను మీశిబికాభారము, జననాయక భూమివృక్షశైలంబులలో
నొనరంగ నేపదార్థం, బునఁ బుట్టిన దది వివేకమున నెఱిఁగితివా.

298


క.

పురుషునికరచరణాదుల, భర మేమిటి చేతఁ దాల్పఁబడు నట్టులపో
నరవర శిబికాభారము, భరియించినవారు లేరు పరమార్థ మిలన్.

299


వ.

అని పల్కి మౌనంబున నెప్పటియట్ల తదీయభారంబు వహించి చనుచున్న యవ్వి
ప్రుం జూచి శిబికావతరణంబు చేసి యతనిపాదంబుల వ్రాలి కరకమలంబులు
మొగిచి యిట్లనియె.[6]

300


క.

అనఘాత్మ శిబిక విడువుము, ననుఁ గృపతోఁ జూడు తప్పు నాయెడ లేశం
బును జెంద నీకు మెఱుఁగక, నను మోపించితి మదంబునను నీచేతన్.

301


ఆ.

జాల్మవృత్తి నేల చరియించుచున్నాఁడ, వెందు కేగుదెంచి తెవ్వ రీవు
నీకు నేల యిట్టి నీచకర్మము సేయ, ననిన విప్రముఖ్యుఁ డతనిఁ జూచి.

302


తే.

సోహ మనువాక్య మేమియు నూహ సేయ, వశము గా దుపభోగైకవాంఛ లేక
యేలవత్తురు నృప దేశకాలవశతఁ, జేసి సుఖమును దుఃఖంబుఁ జేరుచుండు.

303
  1. యుగ్మము = జంట, వ్రేఁగు = భారము, జంఘలన్ = పిక్కలను, ఊరువులను = తొడలను, అల్ల = మెల్లగా - తాలిమితో ననుట, గౌరవంబు = గురుత్వము - భారము, ఇప్పాటన్ = ఈరీతిగా.
  2. గుణప్రవాహపతితము = గుణపరిణామరూపమైన వెల్లువయందు పడినది, బహుళకర్మవశతన్ = విశేషకర్మలను నడపుటయందలి యధీనత్వముతో.
  3. అవిద్యకలిమిన్ = అజ్ఞానము కలుగుటచేత - జ్ఞానములేమిచే ననుట, అక్షరము = చెడనిదైన పరబ్రహ్మము.
  4. భూ...భుజంబులచేతన్ = భూమిపాదములు పిఱుఁదులు తొడలు మడికట్టు
    కడుపు ఱొమ్ము భుజములు వీనిచేత, తెల్లంబు = స్పష్టము.
  5. తక్కక = తప్పక, అక్కఱముగన్ = ఆశ్చర్యముగా.
  6. బికావతరణంబు చేసి = అందలమునుండి దిగి.