పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దడఁబాటుందనముం బరిస్ఫుటముగాఁ దా నుండెఁ బ్రచ్ఛన్నుఁడై.[1]

274


ఆ.

కడుపువెంట లాల గాఱంగ మాసిన, పాఁతగట్టి జనులు రోఁతపుట్టి
చేరకుండ నుపమ చేసె నాత్మజ్ఞాన, సిద్ధి వృద్ధిఁ బొందఁజేయుకొఱకు.[2]

275


సీ.

చదువు మానిపి బ్రహ్మచారులుఁ దానును నిచ్చవచ్చిన యాటఁ బెచ్చు పెరుగు
వేదవాదము సేయువిద్వజ్జనంబులు వీక్షించి నవ్వుచు వెక్కిరించు
నెల్లవారును దన్ను హేయంబు గావింప నపవిత్రకర్మంబు లాచరించు
వర్ణాశ్రమాచారవర్తనంబులు మాని యాహారవాంఛ యెందైనఁ దీర్చు


తే.

జనులపరిభూతి నొందుచు సంతతంబు, నీచగుణముల నేకాకియై చరించు
జాల్మవేషంబుతోఁ బిశాచంబురీతి, వికృతభావంబుతో నుండు విప్రవరుఁడు.[3]

276


వ.

ఇట్లు బాలోన్మత్తపిశాచభావంబులు గైకొని కుల్మాషఖాద్యశాకవన్యఫలాదు
లుపయోగించుచు దేహయాత్ర నడుపుచున్నంత తండ్రి పరలోకగతుం డగుట
యును.[4]

277


తే.

భ్రాతృభాతృవ్యబాంధవప్రతతు లెల్ల, క్షేత్ర కర్మంబు లొనరింపఁ జేనిపనికి
దాను నొక్కొక వేళ ముందఱనె పోయి, యారబముసేయు మిథ్యాప్రయత్నమునను.[5]

278


వ.

మఱియు రూక్షపీనావయవగాత్రుండును జాడ్యకర్మకుండును నై సకలజనోప
కారం బైనయాహారవేతనాపరుండై సంస్కారసహితంబు లైనపనులు సమస్త
జనంబులకుం జేయుచు సాధారణబ్రాహ్మణుండై వర్తించుచున్నంత నొక్కనాఁడు.[6]

279


తే.

వీరరాజసునృపతి వివేకశాలి, ప్రకటసంసారదుఃఖపరంపరలను
నలఁగి నిర్వాణసౌఖ్యంబునకుఁ దలంపు, చేసి సర్వంబు మది విసర్జించి యతఁడు.[7]

280
  1. జడవేషంబు = మూఢునివేషమువంటి వేషము, గ్రామ్యభాషలు = అపభ్రంశపుమాటలు, అవిస్పష్టానులాపంబులు = చక్కగా తెలియఁబడక మాటికిమాటికి చెప్పినదానినే చెప్పుట, పటు...కేశంబులున్ = మిక్కిలి దుమ్ముకమ్మిన వెండ్రుకలును, బెడఁకుంజూపులు = బెదరుచూపులు, క్లిన్నదంతచయమున్ = తడిసినపండ్లనమూహమును - జొల్లు కాఱుటచేత తడిసిన వనుట, దడఁబాటుందనమున్ = భ్రమించుస్వభావమును, స్ఫుటముగాన్ = చక్కగా (చూచువారికి) కనఁబడుచుండఁగా.
  2. లాల = జొల్లు, ఉపమ = ఉపాయము.
  3. పెచ్చు పెరుగున్ =జృంభించును, హేయంబు = రోఁత, అపవిత్రకర్మంబులు = అపరిశుద్ధములైన పనులు, ఎందైనన్ = ఎక్కడనైనను, పరిభూతిన్ = అవమానమును, జాల్మవేషముతోన్ = నీచవేషముతో.
  4. ఉన్మత్త = పిచ్చివానియొక్కయు, కుల్మాషఖాద్యశాకవన్యఫలాదులు = గుగ్గిళ్లు కజ్జాయము కూరలు అడవియందలిపండ్లు మొదలగునవి, దేహయాత్ర = శరీరసంరక్షణమును.
  5. క్షేత్రకర్మంబులు = సేద్యపుఁబనులు, ఆరబము = పైరు.
  6. రూక్ష...గాత్రుండు = పరుసనై బలిసినయవయవములతోడి దేహము గలవాఁడు, జాడ్యకర్మకుండు = మోటుతనపుపనులు చేయువాఁడు, ఆహారవేతనాపరుఁడు = కడుపుకూటికి పని చేయుటయందు ప్రియము గలవాఁడు, సంస్కారసహితంబులు = చక్కఁబఱుచుటతోఁ గూడినవి.
  7. నిర్వాణసౌఖ్యంబునకున్ = మోక్షసుఖమునకు.