పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్దెక్కినదాఁక వనంబునఁ, జిక్కిన దుఃఖించు రాజు చిత్తములోనన్.[1]

258


క.

నెయ్యము నా కొనరించుచు, నియ్యాశ్రమభూమిఁ బాయ దేకాలము నేఁ
డయ్యో మృగశాబం బే, మయ్యెనొకో దుష్టమృగచయంబులచేతన్.[2]

259


తే.

సామవేదగానంబులు చదువుచున్న, బ్రహ్మచారులకరణిఁ జూపట్టు నిచట
బాలతృణకాండములు గానఁబడఁగ మేయ, కేల పోయెనొకో దూర మీమృగంబు.[3]


వ.

అని యనేకప్రకారంబులం జింతించుచు.

261


సీ.

ఏణశాబకముచొ ప్పెంతయుఁ పరికించి నెమకంగఁ గొండొకనేల యరుగుఁ
గానలో మృగడింభకము వోవఁ బెంచిన యిఱియో యని పట్ట నేగుదెంచుఁ
దోరంబుగా మింట ధూళి రేఁగినఁ జూచి హరిణపోతము వచ్చెనని చెలంగుఁ
బొదలలో నేమేనిఁ గదలినఁ దనకురంగార్భకమో యని యాసఁ జెందు


ఆ.

నెందునుండియైన నింతకు రాకుండ, దనుచు మగిడివచ్చు నాశ్రమమున
కివ్విధమున నానరేంద్రయోగీశ్వరుఁ, డధికమోహయుక్తుఁ డగుచు నుండె.[4]

262


మ.

సుతులం గాంతల రాజ్యవైభవములం జుట్టాలనుం బాసి యు
న్నతకైవల్యపదంబుఁ గైకొనుటకే నారాయణుం గొల్చుచున్
ధృతి వర్తించు మహాత్ముఁ డాభరతధాత్రీభర్త యయ్యేణసం
గతదోషంబున మోహియయ్యె ఘనయోగధ్యాననిష్ప్రాపుఁ డై.[5]

263


వ.

ఇవ్విధంబునఁ బూర్వపరిచితం బైన యోగసమాధి వదలి తదాసక్తచేతస్కుడై
యుండి కొండొకకాలంబునకు దేహధారి గావున శరీకంబు విడుచుచుండి.[6]

264


క.

పెంచినమృగశాబము వీక్షించి తదాస క్తమైన చిత్తముతో నొ
క్కించుకయు వివేకము మది, నెంచక బాష్పాంబుపూరనేత్రంబులతోన్.[7]

265


క.

ఆమృగపోతముఁ గన్గొని, యోముద్దులకుఱ్ఱ నిన్ను నొంటివిడిచి నా

  1. ప్రొద్దెక్కినదాఁకన్ = మిక్కిలి ప్రొద్దుపోవునంతవఱకు.
  2. నెయ్యము = స్నేహము - ప్రియము.
  3. చూపట్టున్ = కనఁబడును, బాలతృణకాండములు = లేఁతగడ్డిపోచలు.
  4. ఏణశాబకముచొప్పు = జింకపిల్లజాడ, నెమకంగన్ = వెదక, కొండొక - కొంత, కానలో మృగడింభకము = అడవియందలి జింకపిల్ల, తోరంబుగాన్ = అధికముగా, మింటన్ = ఆకాశమునందు, హరిణపోతము = జింకపిల్ల, చెలంగున్ = సంతోషించును, కురంగార్భకము = జింకపిల్ల.
  5. ధృతిన్ = ధైర్యముతో, ఏణసంగతదోషంబునన్ = జింకయొక్క సహవాసమువలని లోపముచేత, మోహి = మోహముగలవాఁడు, నిష్ప్రాపుఁడు = పొందనివాఁడు.
  6. పూర్వపరిచితంబు = ముమపు అలవాటు పడినది, తదాసక్తచేతన్కుండు = ఆజింకపిల్ల యందు ఆసక్తమైన మనసుగలవాఁడు.
  7. బాష్పాంబుపూరనేత్రంబులతోన్ = శోకజలములప్రవాహముచేత నిండివకన్నులతో - కన్నులనిండ నీళ్లు పెట్టుకొని యనుట.