పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విశ్వంభరయు మహాద్వీపంబులును బర్వతంబులు బహుసముద్రములు నదులు
వర్షంబులును బుణ్యవనదేశములు మానసాదిపుష్కరిణులు వేదములును


తే.

భూర్భువాదిలోకంబులుఁ బుణ్యపాప, కర్మములు మేరగాఁ బద్మగర్భుసృష్టిఁ
గలిగి నన్నియు నిందికాకాంతుఁడైన, విష్ణుదేవునిరూపముల్ విప్రముఖ్య.[1]

237


క.

విష్ణుఁడె జ్యోతిశ్చక్రము, విష్ణుండే భువనగిరులు విష్ణుఁడె నదులన్
విష్ణుఁడె మహాపయోధులు, విష్ణుఁడె పూర్వాదిదిశలు విష్ణుఁడె జగముల్.[2]

238


తే.

సంయమీశ్వర యతులవిజ్ఞానమహిమ, వలన సకలంబు నైక్యభావము వహించి
నవి పృథగ్భేదరూపంబు లగుచు నామ, ధేయసంజ్ఞల వాగ్వృత్తిఁ దేజరిల్లు.[3]

239


తే.

పుడమిమన్ను ఘటత్వంబుఁ బొంది యది క, పాలమై మఱి లోష్టరూపము వహించి
భాసపరమాణువృత్తులఁ బరఁగినట్టు, లొక్కటియుఁ బెక్కువిధముల నుల్లసిల్లు.[4]

240


క.

వనజభవుసృష్టివలనన్, జనియించినయ ప్రపంచపంచారములె
ల్లను విష్ణుమూర్తులగు నై, నను వస్తువిభేదవృత్తి నడుచు మునీంద్రా.[5]

241


వ.

అని యిట్లు సంక్షేపంబుగా సకలంబును బరమోపదేశంబు చేసిన యాచార్యు
నకు శిష్యుం డిట్లనియె.

242

జడభరతోపాఖ్యానము

సీ.

దురితదూరుఁడు భరతుండు సాలగ్రామతీర్థంబునకుఁ బోయి దివ్యయోగ
విద్యావిలాసుఁడై విష్ణుని పరమాత్ము భజియించి మును ముక్తిఁ బడయలేక
జన్మాంతరంబున సద్బ్రాహ్మణుండయ్యె నని మున్ను చెప్పితి రట్టులైన
విధ మేమి యాతఁడు విప్రుఁడయ్యు గృహస్థధర్మంబు లైనబంధములఁ దగిలి


తే.

యుండెనో కాక పరతత్త్వయోగవిద్య, నొంది కైవల్యసౌఖ్యంబు నొందెనో మ
హాత్మ యాచరితంబు నా కానతియ్య, వలయు ననుటయు నిట్లని పలికె నతఁడు.[6]

243


మ.

అకలంకప్రమదంబుతోడ భరతుం డారీతి సంసార మొ
ల్లక కైవల్యసుఖంబుఁ గైకొనఁగ సాలగ్రామతీర్థంబునం

  1. తదధిష్ఠితార్కచంద్రాదులు = దానియందు నిలిచిన సూర్యుడు చంద్రుడు మొదలగువారు, విశ్వంభర = సమస్తమును భరించునది - భూమి, వర్షంబులు = భరతవర్షము మొదలుగునవి, పుష్కరిణులు = సరస్సులు, పద్మగర్భసృష్టిన్ = బ్రహ్మసృష్టియందు, ఇందిరాకాంతుఁడు = లక్ష్మీపతి - విష్ణువు.
  2. మహాపయోధులు = గొప్పసముద్రములు.
  3. ఐక్యభావము = ఒక్కటి యగుట, పృథగ్భేదరూపంబులు = వేఱైనయితరరూపములు.
  4. పుడమి = భూమి, ఘటత్వము = కుండతనము - కుండ యగుట, భాస = తోఁచునట్టి, ఉల్లసిల్లున్ = ఒప్పును.
  5. ప్రపంచసంచారములు = ప్రపంచమునందు సంచరించునవి, వస్తువిభేదవృత్తి = వస్తువులయందలి భేదవ్యాపారము.
  6. దివ్య...విలాసుఁడు = ఉత్తమమైనయోగవిద్యయందు క్రీడించువాఁడు, భజియించి = సేవించి, ఆచరితంబు = ఆభరతునియొక్క చరిత్రమును.