పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మెక్కి కడుమందవృత్తితో నినసుతుండు, మించి యత్యుగ్రుఁడై సంచరించుచుండు.[1]

230


క.

భృంగాభములై మెఱయుతు, రంగాష్టక మమరి ధూసరచ్ఛాయలచేఁ
బొంగారురథమునందుఁ జె,లంగును స్వర్భానుఁ డతివిలాసముతోడన్.[2]

231


తే.

పర్వములయందు రాహువు భానుచంద్ర, మండలగ్రసనములకు మలయుచుండు
[3]నొనరఁగా సూర్యశశధరు లున్నఋక్ష, ములకుఁ దా వచ్చినప్పుడు మొనసి పట్టు.[4]

232


తే.

అనిలవేగంబు లగుచు లాక్షాదిశోణ, వర్ణములతోడి యెనిమిదివాహనముల
నమరి ధూమ్రపలాలవర్ణమునఁ దనకు, నరదమున నుండి కేతుగ్రహంబు మెరియు.[5]

233


వ.

ఇట్టిసూర్యాదినవగ్రహనక్షత్రతారాధిష్ణ్యాదులు ధ్రువునందు దృఢబంధంబు లై
నవాయునాళంబు లాధారంబులుగా నుచితసంచారంబులుగాఁ బ్రవర్తిల్లుచుండు.[6]

234


క.

చక్రధరునాజ్ఞ జ్యోతి, శ్చక్రం బీరీతిఁ దైలచక్రముగతి ని
ర్వక్రముగఁ దిరుగుచుండు న, నుక్రమమున నాసమీరణునివశగతులన్.[7]

235


శా.

జ్యోతిశ్చక్రమునందుఁ దా నధికతేజోయుక్తమై లోకవి
ఖ్యాతిం జెందినశింశుమార మొనరంగా నర్థి నెవ్వా రతి
ప్రీతిన్ రాత్రులు చూతు రాఘనులు గారే సార్వకాలంబు ని
ర్ధూతానేకకళంకు లౌదురు మహత్తుల్ వారి వర్ణింపఁగన్.[8]

236


సీ.

అనయంబు శింశుమారాకృతి నున్నజ్యోతిశ్చక్రమును దదధిష్ఠితార్క
చంద్రాదులును దివిజేంద్రాదిసురులును ధిష్ణ్యాదినక్షత్రదేవతలును

  1. శబళవర్ణంబులు = చిత్రవర్ణము కలవి, నభస్సంభవంబులు = ఆకాశమునందుఁ బుట్టినవి, ఘోటకములతోడన్ = గుఱ్ఱములతో, పూన్చునరదము = వహించునట్లు చేసినరథమును, మందవృత్తితోన్ = మెల్లనివర్తనముతో, ఇనసుతుఁడు = సూర్యునికొడుకు - శనైశ్చరుఁడు, అత్యుగ్రుఁడై = మిక్కిలిభయంకరుఁడై.
  2. భృంగాభములు = తుమ్మెదవన్నె గలవి - నల్లనిని, తురంగాష్టకము = గుఱ్ఱములయెనిమిది - ఎనిమిదిగుఱ్ఱములు, ధూసరచ్ఛాయలచేన్ = బూడిదవన్నెచే, పొంగారు = పొంగు - ఆతిశయించు, చెలంగును = ఒప్పును, స్వర్భానుఁడు = రాహువు.
  3. ఇందునందుండి సూర్యునియందు (?) నందునుండి సుధాకరునందు మెలఁగు, అని పాఠాంతరము.
  4. భానుచంద్రమండలగ్రసనములకున్ = సూర్యచంద్రబింబములను మింగుటకు - గ్రహణముకొఱకు అనుట, మలయుచుండున్ = ఉత్సహించుచుండును - తమకపడుచుండును, శశధరుఁడు = చంద్రుఁడు, ఋక్షములకున్ = నక్షత్రములకు, మొనసే = పూని.
  5. అనిలవేగములు = గాలివడివంటివడి గలవి, లాక్షా...వర్ణములు = లత్తుకయెఱుపుచాయ కలవి, ధూమ్రపలాలవర్ణమునన్ = పొగవన్నెయు పూరికఱ్ఱవన్నెయుఁ గలసినవన్నెతో.
  6. నవగ్రహనక్షత్ర తారాధిష్ణ్యాదులు = తొమ్మిదిగ్రహములయొక్కయు ఇరువదియేడునక్షత్ర ములయొక్కయు నక్షత్రస్థానములు మొదలగునవి, వాయునాళంబులు = గాలిక్రోవులు, ఉచితసంచారంబులుగాన్ = తగినసంచారము కలవిగా.
  7. తైలచక్రముగతిన్ = గానుఁగవలె, నిర్వక్రముగన్ = వంకరలేక - సరిగా, సమీరణుని = వాయువుయొక్క.
  8. శింశుమారము = శింశుమారచక్రమును, సార్వకాలంబులు = ఎల్లప్పుడు, నిర్ధూతానేకకళంకులు = సమస్తదోషములును దూరముగా ఎగఁజిమ్మినవారు.