పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పావకుం డాది ముప్పదిమూఁడుకోట్ల నిర్జరులును గృష్ణపక్షమున నాసు
ధాంశునికళలు పాయక పాన మొనరింప ద్వికళావశిష్టుఁడై దీప్తి యడఁగి
సూర్యమండలమునఁ జొచ్చు నాసూర్యేందుసంగమంబును సర్వసంజ్ఞ మయ్యె
నాపర్వకాలంబునందుఁ బదేనవయమవసకళ భానునందుఁ గలియు


తే.

నది నిమిత్త మమావాస్య యగుసుధాక, రుండు నాఁడెల్ల జలములో నుండి పిదప
లతలయందును భూరుహతతులయందు, నధివసించుఁ గళామాత్రుఁ డై మునీంద్ర.[1]

224


క.

లతలును నోషధులును బశు, తతులు మనుష్యులును మఱియుఁ దక్కిన జంతు
ప్రతతియు బ్రతుకును ద్రిజగ, ద్ధితనిర్మలమూర్తి యైరహిమకరువలనన్.[2]

225


క.

అనిలాగ్నిద్రవ్యంబుల, జనియించినరథమునను బిశంగాభములై
ఘరవాయువేగతురగము, లెనిమిది విలసిల్లనుండు నిందుజుఁ డెలమిన్.[3]

226


క.

 సోపాసంగంబుగ నవరూపం బగుపడగతో హరులతో మిగులన్
దీపించుదివ్యరథమున, నేపారును దనుజమంత్రి యెంతయు గరిమన్.[4]

227


తే.

పద్మరాగవర్ణంబునఁ బరఁగు హరుల, తోడ నెనిమిదియంచుల దొరసి వహ్ని
సంభవంబైన కాంచనస్యందనంబు, నందు నంగారకుఁడు చెలువారుచుండు.[5]

228


క.

ఘనపాండురవర్ణములౌ, నెనిమిదిగుఱ్ఱముల నమరి హేమమయంబై
తనరినరథ మెక్కి గురుం, డొనరఁగ నేఁడాది రాశి నుండి చరించున్.[6]

229


తే.

శబళవర్ణంబులై నభస్సంభవంబు, లైన ఘోటకములతోడఁ బూన్చు నరద

  1. పావకుండు = అగ్ని, నిర్జరులును = దేవతలును, సుధాంశునికళలు = చంద్రునికళలను, ద్వికళావశిష్టుఁడు = రెండుకళలచేత మిగిలినవాఁడు, దీప్తి = ప్రకాశము, సూర్యేందుసంగమంబును = సూర్యచంద్రులయొక్క చేరికయు, పర్వసంజ్ఞము = పర్వమను పేరుగలది, భూరుహతతులయందున్ = వృక్షసమూహములయందు, అధివసించున్ = నివసించును - ఉండును, కళామాత్రుఁడు = ఒకకళమాత్రము కలవాఁడు.
  2. ప్రతతి = తతి - సమూహము, త్రిజగ...మూర్తి = మూఁడులోకములకు మేలు చేయునట్టి స్వచ్ఛమైన యాకృతి
    గలవాఁడు, హిమకరువలనన్ = చంద్రునివలన.
  3. పిశంగాభములు = గోరోజనపువన్నె గలవి, ఇందుజుఁడు = చంద్రునికొడుకు - బుధుఁడు.
  4. సోపాసంగంబుగన్ = అమ్ములపొదితోఁ గూడినదిగా, అపరూపంబు = అపూర్వము, పడగతోన్ = టెక్కముతోను, హరులతోన్ = గుఱ్ఱములతోను, ఏపారున్ = అతిశయించును, దనుజమంత్రి = శుక్రుఁడు.
  5. పద్మరాగవర్ణంబు = కెంపువన్నెతో, దొరసి = కలిగి, వహ్నిసంభవంబు = అగ్నివలనఁ బుట్టినది, కాంచనస్యందనంబునందున్ = బంగారురథమునందు, చెలువారు = ఒప్పు.
  6. పాండురవర్ణములు = తెల్లనివన్నె గలవి, హేమమయంబు = బంగారుతో చేయఁబడినది, తనరిన = ఘనతకెక్కిన, ఏఁడాది రాశి నుండి = ఒక్కొకసంవత్సరము ఒక్కొకరాశియం దుండి.