పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షమున విభాకరప్రభలు గైకొని పుష్టి వహించు నెంతయున్.[1]

217


ఆ.

అమృతకిరణువలన నర్ధమాసము తృప్తి, దేవతలకు మాసతృప్తి సకల
పితృగణములకును సతతంబు తృప్తి మ, ర్త్యులకు నమృతమయమయూఖములను.[2]

218


సీ.

వనజారితేరియశ్వంబు లంభోగర్భసంభవంబులు కుందరన్నిభములు
మిథ్యాక్రమంబులై మెఱయుచు నౌత్తానపాది యాధారమై పటురయమున
సంచరించుచు నుండు సవ్యాపసవ్యభాగంబుల నారెండుకల్పకాల
పర్యంతమును దృఢబంధంబులై పంకజాప్తునియరదంబు హరులయట్ల


తే.

యుండు నాసీతకరుని మయూఖసమితి, హాని వృద్ధుల నుండు నుష్ణాంకునట్టు
లంబు సంభూత మైనయాయమృతకరుని, పుష్టి కారణభూతమై పొలుచు నినుఁడు.[3]

219


క.

అందంద గృష్ణపక్షము, నందుఁ గళాశేషముగ సుధాంశము లగు న
య్యిందుకళలు పదియేనును, బృందారకకోటిచేతఁ బీతమగుఁ జుమీ.[4]

220


ఆ.

అమృతమయము లైనయర్కునికిరణంబు, లొనర శుక్లపక్షమునఁ బదేను
తిథులయందు వరుస ద్విజరాజుఁ దృప్తి గా, వించు దానఁ గళలు వృద్ధిఁ బొందు.[5]

221


క.

సితకరునిపదేనవకళ, పితృగణములచేత నెల్లఁ బీతంబగుటన్
క్షితిదేవముఖ్య యమవస, పితృతిథి యని చెప్పఁబడును బెద్దలచేతన్.[6]

222


చ.

అమవసనాఁడు చంద్రుఁడు లతావలియందు వసించి మాకులం
దమృతము నించి సూర్యగతుఁడై చనుఁ గావున నెవ్వఁడేని ప
త్రము కొనగోరఁ గిల్లినను బ్రాహ్మణహత్య యొనర్చినట్టిపా
పమున నధోగతిం బడి విపద్దశ నొందు ననేకకాలమున్.[7]

223
  1. జలజాప్తమయూఖములన్ = సూర్యకిరణములచేత, ప్రవృద్ధమై = చక్కగా పెరిగినదై, చంద్ర...సుధామృతమున్ = చంద్రబింబమువలనఁ గలిగి స్వచ్ఛమైన యమృతమును, పెద్దయున్ = మిక్కిలి, వికాసము నొందున్ = వికసించును, దివాకరప్రభలు = సూర్యకిరణములు, పుష్టి వహించున్ = బలియును.
  2. అమృతకిరణువలనన్ = చంద్రునివలన, అమృతమయ = అమృతస్వరూపములైన, మయూఖములను = కిరణములచేత.
  3. వనజారి = చంద్రునియొక్క, అంభోగర్భసంభవంబులు = జలగర్భమునఁ బుట్టినవి - జలమయము
    లనుట, కుందనన్నిభములు = మొల్లపువ్వులను బోలినని, మిథ్యాక్రమంబులు = క్రమము లేనివి - పెనఁగొన్నవి, ఔత్తానపాది = ధ్రువుఁడు, పటురయమునన్ = మిక్కిలివేగమున, సవ్యాపసవ్యభాగంబులన్ = కుడియెడమతట్టులను, కల్పకాలపర్యంతమును = ప్రళయకాలమువఱకును, పంకజాప్తునియరదంబుహరులయట్ల = సూర్యునితేరిగుఱ్ఱములవలెనే, శీతకరుని మయూఖసమితి = చంద్రకిరణసమూహము, ఉష్ణాంశునట్టులు = సూర్యునివలె, అంబుసంభూతము = నీటివలనఁబుట్టినది, అమృత... పొలుచున్ = చంద్రునిబలుపునకు హేతువైనదై యుండును.
  4. అందంద = పునఃపునః - మరలమరల, కళాశేషమునన్ = ఒక్కకళయొక్క మిగులుగా, సుధాంశములు = అమృతభాగములు, ఇందుకళలు = చంద్రునికళలు, బృందారకకోటిచేతన్ = దేవతాసమూహముచేత, పీతము = పానముచేయబడినది.
  5. ద్విజరాజున్ = చంద్రుని.
  6. సితకరుని = చంద్రునియొక్క, అమవస = అమావాస్య.
  7. లతావలియందున్ = తీఁగలపఙ్క్తులయందు, నించి = నిండించి, చనున్ = తగును - ఒప్పు ననుట, పత్రము = ఆకు, విపద్దశన్ = ఆపదను.