పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గలిగిన సకలోదకములుఁ బీలిచి దెచ్చి యమృతాంశుమండలమందు నునుచు
నాయబ్జవైరియు వాయునాళంబులు నాకాశభాగంబునందు దాఁచు
మారుతసలిలధూమజ్యోతిసంయోగమునఁ జేసి జలధరంబులు జనించి


తే.

వృష్టి సంస్కారకాలప్రవృత్తివలన, వాయుబంధంబులెల్లను వదలి నింగి
నున్నజలములు చెందుఁ బయోధరముల, దానఁ జేసియు జగతిని వాన గురియు.[1]

199


మ.

పొరి నూర్ధ్వాభిముఖంబు లైనరవిదీప్తుల్ దివ్యగంగాసము
త్కరతోయంబులు పీల్చి తెచ్చి ధరమీఁదన్ జల్లుగాఁ జల్లినన్
ధరణీముఖ్యసమర్క్షఘస్రముల నబ్దశ్రేణి లేకుండియున్
దొరఁగున్ వృష్టి తదీయపుణ్యజలబిందుస్నానముల్ దివ్యముల్.[2]

200


ఉ.

కృత్తికనుండి బేసి యగు ఋక్షములందుఁ బయోధరావలీ
వృత్తి యొకండు లేక మహి వృష్టిమయంబగు దిగ్గజంబు లు
ద్వృత్తిమెయిన్ వియత్తలనదిన్ విహరించుచు నీరు చల్లు వి
ప్రోత్తమ దివ్యతీర్థ మది యోగ్యము స్నానము సేయఁగల్గినన్.[3]

201


క.

మేఘములు గురియు వాన ల, మోఘములై భూమిభాగమున నిండినస
స్యౌఘంబులు నోషధులు ని, రాఘాటములై జనించునట్లుగఁ జేయున్.[4]

202


చ.

అవి ఫలపాకసాధకములై యభివృద్ధి వహింపఁజేయుచున్
భువనములం బ్రజాజననపోషణకారణహేతుకంబులై

  1. కాలాత్ముఁడు = కాలస్వరూపుఁడు, చండాంశువులచేతన్ = తీక్ష్ణములైనకిరణములచేత, పీలిచి = ఆకర్షించి, అమృతాంశుమండలమునందు = చంద్రబింబమునందు, ఉనుచున్ = ఉంచును, అబ్జవైరి = చంద్రుఁడు, మారుత...చేసి = వాయువు ఆవిరి వెలుఁగు వీనియొక్క కూడికచేత, జలధరంబులు = మేఘములు, వృష్టి...వలనన్ = వాన చక్కఁగాఁ గురియఁదగిన కాలముయొక్క రాకచేత, వాయుబంధంబులు = గాలివలని నిర్బంధములు, నింగిన్ = ఆకాశమునందు, చెందుఁ బయోధరములన్ = మేఘములయందు పొందును, దానఁ జేసియు = దానిచేతను, జగతిని = భూమియందు.
  2. పొరిన్ = క్రమముగా, ఊర్ధ్వాభిముఖములు = మీఁదితట్టునకు తిరిగినవి, రవిదీప్తులు = సూర్యకాంతులు, జల్లుగాన్ = దట్టపుచినుకులు గలవానగా, ధరణీముఖ్య = భూమియందు శ్రేష్ఠుఁడైన మైత్రేయుఁడా, సమర్క్షఘస్రములన్ = రోహిణ్యాది సమనక్షత్రములయందు సూర్యుఁ డుండునపుడు పగళ్లయందు, అబ్దశ్రేణి = మేఘపఙ్క్తి, తొరఁగున్ = స్రవించును - వర్షించును, తదీయజలబిందుస్నానములు = ఆ కురియునట్టి జలబిందువులచేతనైన స్నానములు, దివ్యములు = స్వర్గసంబంధులు గనుక దివ్యాఖ్యములు, ఇట్టి దివ్యస్నానము చేసినవావికి నరకములేదని చెప్పఁబడియున్నది.
  3. బేసి = విషమము, ఋక్షములందున్ = నక్షత్రములయందు, పయోధరావలీవృత్తి - మేఘపఙ్క్తియొక్క వ్యాపారము, ఒకండున్ = ఒకటియును, వృష్టిమయము = వానచే నిండినది, ఉద్వృత్తిమెయిన్ = నిక్కుతో, వియత్తలనదిన్ = ఆకాశగంగయందు.
  4. అమోఘములు = మొక్కపోనివి - తక్కువకానివి, సస్యౌఘంబులు = పైరుల సమూహములు, ఓషధులు = మూలికలు, నిరాఘాటములు = అడ్డి లేనివి.