పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నారదసనకసనందసనత్సుజాతాదు లెచ్చోటఁ బాయక చరింతు
రాకల్పపర్యంత మైనకాలంబు సుపర్వు లేలోకంబుఁ బాసి చనరు
భూర్భువస్వర్లోకములకెల్ల నున్నతస్థానమై యేవంకఁ దనరియుండు


తే.

హరిపదధ్యానపూజాప్రయత్నవిముఖు, లైనవారికి దురవగాహప్రదేశ
మెద్ది యెది నిరుపాధియై యెల్లప్రొద్దు, బరఁగునది విష్ణుదేవుని పరమపదము.[1]

185


క.

నిరతాష్టాక్షరవిద్యా, పరతంత్రులు చిత్సుఖానుభవనిత్యాత్ముల్
హరిభక్తులు “తద్విష్ణోః, పరమం పద” మనుచు నెచట భక్తిఁ దలంతుర్.[2]

186


వ.

అట్టివిష్ణుపదంబున విష్ణుపాదాంగుష్ఠనిష్ఠ్యూతయును ద్రిలోకాధారభూతయును
సకలపాపనివారణయును దేవాంగనావిహారాకారణయును నైనయాకాశగంగ
నిర్భంగతరంగడోలాలోలమరాళజాలయై ప్రవహించి సర్వజ్ఞుం డైనవ్యోమకేశు
జటామకుటమండితయై సంతతప్రాణాయామపరాయణు లైనసప్తమునిమండ
లంబు పరిపూరితంబు చేసి గ్రహతారకాలోకంబు లాలోకించుచు నష్టాశీతిసహస్ర
యోజనవిస్తీర్ణం బైనశశాంకమండలం బాప్లావనంబు చేసి తదీయమయూఖస్రావ
సుధాధారాపూరధావళ్యధాళధళ్యంబులతోడఁ గనకాచలంబుమీఁదఁ బ్రవ
హించి యమరావతి నాల్గుదిక్కులందును సీతాలకనందాచక్షుర్భద్రాభిధానం
బుల వాహినీచతుష్టయంబై జంబూద్వీపంబుఁ బరమపావనంబుఁ జేసి యలక

  1. వేది = వేదిక - హోమగుండము (దీనికి మఱియొక అర్థము అరుఁగు), చరింతురు = మెలఁగుగుదురో, ఆకల్పపర్యంతము = ప్రసిద్ధమైన ప్రళయకాలమువఱకు, సుపర్వులు = దేవతలు, ఏవంక = ఏతట్టు - ఏచోటు అనుట, విముఖులు = మాఱుమొగము గలవారు - చేయనివారు, దురవగాహప్రదేశము = దుర్లభమైనచోటు, నిరుపాధి = ఉపాధిలేనిది - నిర్విచారమైనది, పరమపదము = ఉత్కృష్టస్థానము.
  2. నిరత...తంత్రులు = ఎడతెగని అష్టాక్షరవిద్యయందలి యాసక్తి గలవారు, చిత్సు...నిత్యాత్ములు = జ్ఞానామృతమును అనుభవించునట్టి చెడనిమానసములు గలవారు.