పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మాతయై విలసిల్లు మంత్రంబుచే భక్తి నర్ఘ్యంబు లిచ్చుచో నాజలములు
వజ్రంబులై దైత్యవరుల నందఱ వధియించి తేజంబు గావించు రవికి
నీచందమున యామినీచరశ్రేణికిఁ బ్రతిదినంబును గల్గుఁ బ్రాణహాని


తే.

యగ్నిహోత్రంబులను బ్రథమాహుతుల వి, కర్తనాప్యాయనం బయి కడునతనికి
ఘనమయూఖంబు లెంతయుఁ గాంతి మెఱసి, భువనమంతయు నభివృద్ధిఁ బొందఁజేయు.[1]

180


క.

కావున బ్రాహ్మణులకు సం, ధ్యావిధు లొనరింపవలయుఁ దత్కాలమునన్
భూవినుత యగ్నిహోత్రము, గావింపఁగవలయు రెండుకాలములందున్.

181


ఆ.

కాల మెఱిఁగి సంధ్య గావింపనేరక, యగ్నిహోత్రవిధియు నాచరింప
నొల్లఁడేని యెంతయోగ్యుఁడై యున్ననా, బ్రాహ్మణుండు ద్రోహి భాస్కరునకు.

182


వ.

ఇట్లు భగవంతుం డైనయంశుమంతుండు పరమవైఘానసు లయినవాలఖిల్యాది
బ్రాహ్మణోత్తములచేత సంరంక్షితుండై కాలంబు గడపుచు జగంబులు పరిపాలిం
చుచుండు నమ్మహాత్ముని యుదయంబు మొదలుగా మూఁడేసి ముహూర్తంబులప
ర్యాయంబునం బ్రాతస్సంగవమధ్యాహ్నాపరాహ్ణసాయాహ్నంబులను కాలపంచ
కంబు పదియేనుముహూర్తంబులై నడుచు రాత్రియు నంతియకాలంబగు నుత్త
రదక్షిణాయనంబులం జేసి దివసరాత్రంబులు హానివృద్ధులై నడుచు మేషతులాసం
క్రమణంబులు రేలుఁ బగళ్లు సమంబులై యుండు నట్టివిషువకాలంబులు దేవ
పితృసంతర్పణజపతపోనుష్ఠానదానంబులకు యోగ్యంబులై ప్రవర్తిల్లు నని చెప్పి
మఱియును.[2]

183


తే.

సప్తమునిమండలముమీఁద శతసహస్ర, యోజనంబులపొడవున నుండు ధ్రువుఁడు
అదిగదా విష్ణుపదమయ్యె నట్టివిష్ణు, పదమునందుఁ జరింతురు బ్రహ్మవిదులు.[3]

184


సీ.

సంతతంబును గాలచక్రమధ్యమున వేదియుఁబోలె ధ్రువుఁ డెందుఁ దేజరిల్లు

  1. భూసురోత్తములు = బ్రాహ్మణశ్రేష్ఠులు, వైదికప్రణవపూర్వముగన్ = వేదసంబంధియైన ప్రణవము ముందు కలుగునట్టుగా - తొలుత ప్రణవము నుచ్చరించుచు ననుట, వేదమాత = గాయత్రి, అర్ఘ్యంబులు = మంత్రోదకములు, వజ్రంబులు = వజ్రాయుధములు, తేజంబు గావించు = తేజస్సు కలుగఁ జేయును, యామినీచరశ్రేణికిన్ = రాక్షససమూహమునకు, ప్రాణహాని = చావు, వికర్తనాప్యాయనంబయి = రాక్షసులయొక్క రాయిడివలని బడలిక తీఱి, మయూఖంబులు = కిరణములు, భువనము = అశోకము.
  2. అంశుమంతుండు =సూర్యుఁడు, వైఘానసులు = విష్ణుభ క్తులు, సంరక్షితుఁడు = లెస్సగా రక్షింపఁబడినవాఁడు, పర్యాయంబున్ = క్రమముగా, కాలపంచకంబు = కాలములయొక్క అయిదు - అయిదుకాలములును, యోగ్యంబులు = తగినవి.
  3. బ్రహ్మవిదులు = పరతత్వము నెఱిఁగినవారు.