పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బై యమరు నదృశ్యంబై, పోయినదెస పశ్చిమంబు భూజనములకున్.[1]

166


తే.

కాన మేరువు నర్త్యలోకమునకెల్ల, ను త్తరం బట్టికనకాద్రియుపరియందు
బ్రహ్మసభ యుండు దానికిఁ బద్మహితుఁడు, తాఁ బ్రవర్తించుచుండుఁ బ్రదక్షిణముగ.[2]

167


చ.

ఇనుఁ డనిశంబు బ్రహ్మసభ కెల్లఁ బ్రదక్షిణ మాచరింపఁగా
ననుపమదేవలీలఁ బితృయానములం జరియింప నుత్తరా
యణమును దక్షిణాయమునై కడ నున్నతనిమ్నవృత్తులం
దనరుచు నుండు నంబరపథంబునఁ గాలగతి న్మునీశ్వరా.[3]

168


తే.

మకరమాసంబు మొదలు యుగ్మంబు తుదిగ, నాఱునెల లుత్తరాయణ మయ్యె రవికి
నందు రాత్రులు కుఱుచలై యహము లెక్కు, డగుచు నడుచును గాలపర్యాయమునను.[4]

169


తే.

కర్కటం బాదిచాపంబు గడపలైన, యాఱుమాసంబులును దక్షిణాయనంబు
అందు నహములు గొంచెంబు లగుచునుండు, దినదినంబుల రేలు వర్ధిల్లుచుండు.[5]

170


వ.

మేషతులాసంక్రమణంబులు విషువ అట్టివిషువకాలంబుల దివారాత్రంబులు
సమంబులై నడచు నయ్యహోరాత్రంబులు మేదినీభాగపర్యాయంబులు
ముప్పదిముహూర్తంబులను ద్వాదశరాసులం బ్రవరిల్లు నొక్కొక్కరాశి
యందు రెండునక్షత్రంబు లొక్కపాదంబులెక్క నిరువదేడునక్షత్రంబులఁ
గ్రమంబున ననుగమించు నుత్తరాయణంబున దివాకరుం డమందవిక్రముండై
దివసంబులందు పదుమూడున్నరనక్షత్రంబు బదునెనిమిదిముహూర్తంబులుఁ
జరియించు రాత్రి శీఘ్రగమనుండై యన్నినక్షత్రంబులం దష్టాదశముహూర్తం
బుల నిర్యాణంబు చేయుఁ జక్రసంచారవశంబున నహోరాత్రంబులు సమాధిక
హీనంబులై వర్తించు.[6]

171
  1. తోయజహితుఁడు = సూర్యుఁడు, పూర్వంబు = తూర్పు, అదృశ్యంబై పోయినదెస = కనఁబడకపోయిన దిక్కు - అస్తమించినదిక్కు.
  2. మర్త్యలోకమునకున్ = మునుష్యలోకమునకు, కనకాద్రియుపరియందున్ = మేరుపర్వతముయొక్క మీఁదిభాగమునందు.
  3. అనిశము = ఎల్లప్పుడు, ఉన్నత నిమ్నవృత్తులన్ = మిట్టపల్లముల వ్యాపారములతో - మిట్టలును పల్లములునుగా, అంబరపథంబునన్ = ఆకాశమార్గమున.
  4. యుగ్మము = మిథునము, అహములు = పగళ్లు, కాలపర్యాయమునన్ = కాలక్రమమున.
  5. చాపంబు = ధనుస్సు, కడపల = తుద, రేలు = రాత్రులు.
  6. విషువలు = విషువత్పుణ్యకాలములు, దివాకరుఁడు = సూర్యుఁడు, అమందవిక్రముఁడు = మందముగాని విక్రమము గలవాఁడు - మిక్కిలిమేఢ్రము గలిగి ప్రకాశించువాఁడు, నిర్యాణంబు చేయున్ = అస్తమించును, సమాధికహీనంబులు = కొన్నాళ్లు సమముగాను కొన్నాళ్లు ఎక్కువగాను కొన్నాళ్లు తక్కువగాను ఉండునవి.