పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బైనపొడువున జనర్లోకంబును నుండు నందుఁ గల్పాంతవాసు లైనసనకాదియో
గిబృందంబు వసియించు నాజనర్లోకంబునకుఁ జతుర్గుణోత్తరం బైనయున్నతంబునం
దపోలోకంబు వర్తించు దానికి నాఱుమణుంగు లైనపొడవున సత్యలోకంబు
మెఱయు నందుల వసియించుమహాత్ములు పునరావృత్తిభయంబులు లేక
సానందులై యుండుదు రని చెప్పి మఱియు నిట్లనియె.[1]

148


సీ.

పాదగమ్యం బగు మేదినీవలయంబు భూలోకమయ్యె నాభూమినుండి
వనజాప్తుదాఁక భువర్లోక మగుఁ బద్మమిత్రమండలినుండి మీఁద నయుత
సప్తద్వితీయయోజనముల ధ్రువుఁ డుండులోకంబుదాఁక స్వర్లోక మిట్టి
భూర్భువస్వర్లోకములు మూఁడు కృతకంపుజగము లాజనతపస్సత్యలోక


తే.

ములును కృతకము లవి గావు మునివరేణ్య, యానడుమను మహర్లోక మడఁగుఁ గొంత
కొంత చెడిపోవకుండుఁ గల్పాంతవేళ, నివ్విధంబున లోకంబు లేడు నమరు.[2]

149


క.

అలఘుచరాచరభూతం, బులఁ గలపదునాల్గులోకముల విశ్రుతమై
నలినభవాండం బీక్రియ, విలసిల్లుఁ గపిత్థఫలమువిధమున ఘనమై.[3]

150


వ.

అట్టి బ్రహ్మాండకర్పరంబునకు వెలుపల దశోత్తరగుణితం బైనవిస్తారంబున మహాజ
లంబు పరివేష్టించి యుండు నాజలంబులకుఁ బదిమడుంగు లెక్కువైనవిస్తీర్ణం
బున మహానలంబు చుట్టుకొనియుండుఁ దదీయబాహ్యంబున మహావాయువునట్ల
పొదివియుండు దానికిం బట్టి భాగాధికం బైనవిశాలంబున నాకాశంబు
చుట్టియుండు నీభూతపంచకంబుఁ బొదివి మహద్వస్తువు మెఱయు నామహత్తు
నకు బహిఃప్రదేశంబు ప్రధానపురుషపరివేష్టితంబై యుండు నన్నింటికి నాధా
రభూతయు ననంతరూపయు నైనవిష్ణుమాయాశక్తి సర్వాక్రాంతయై యుండు.[4]

151


మ.

మొదల న్బీజము గల్గియుండఁగఁ గదా మోసెత్తి మూలంబుతో
విదితస్కంధము మించి కొమ్మల గడున్ విస్తారమై పత్రసం

  1. ఆఱుమణంంగులు =ఆఱంతలు, పునరావృత్తిభయంబులు = మరలపుట్టుటలు వెఱపును, సానందులు = సంతోషయుక్తులు.
  2. పాదగమ్యంబు = అడుగును పొందఁదగినది, వనజాప్తుదాఁకన్ = సూర్యునివఱకు, కృతకంపుజగములు = కృతకలోకములు (కృతకము = చేయఁబడినది), కృతకము లవి గావు = అకృతకము లనుట, ఆనడుమను మహర్లోకము = కృతకములును అకృతకములునైన ఆలోకములకు నడుమ మహర్లోకము ఉండును, అడఁగుఁగొంత = ఆమహర్లోకమునందు కొంతభాగము (అణఁగిపోవు) నశించును.
  3. నళినభవాండంబు = బ్రహ్మాండము, కపిత్థఫలమువిధమునన్ = వెలఁగపండువలె.
  4. కర్పరంబునన్ = కొప్పెరకు, దశోత్తరగుణికంబు = నూఱింటి మీఁద గుణింపఁబడినది, విస్తారంబున = విరివిచేత, పరివేష్టించి = ఆవరించి, పదిమడుంగులు - పదంతలు, తదీయబాహ్యంబునన్ = దానికి వెలుపల, పొదివి = చుట్టుకొని, పఙ్క్తిభాగాధికంబు = పదిపాళ్లు ఎక్కువ, సర్వాక్రాంత = అన్నిటిచేతను ఆక్రమింపఁబడినది.