పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాపారంబులు నరులకు, దీపింపగఁ జేయు జ్ఞానదృష్టి మునీంద్రా.[1]

139


క.

జ్ఞానము జ్ఞానమునకు న, జ్ఞానమునకుఁ గారణంబు జ్ఞానాజ్ఞానా
ధీనము విజ్ఞానం బగుఁ, గాన నరుం డెపుడు జ్ఞాని గావలయుఁ జుమీ.

140


వ.

అని యనేకవిధంబుల సుజ్ఞానప్రతిపాదనంబు చేయుచున్నగురునకు శిష్యుం
డిట్లనియె.[2]

141


క.

మునినాథ నాకు నీచే, వినఁగలిగె సమస్తకథలు విస్పష్టముగా
నొనర భువర్లోకాదులు, వినవలతుం జెప్పవే వివేకప్రౌఢిన్.[3]

142


వ.

అనిన నతనికిఁ బరాశరుం డిట్లనియె.

143


క.

మైత్రేయ వినుము పంకజ, మిత్రసుధాకరులరుచులు మెఱసి వెలుంగన్
బాత్రమగుచోటు సాగర, గోత్రద్వీపములతోడి కుంభిని యయ్యెన్.[4]

144


ఆ.

అవని యెంతవిరివి యై యుండు నింగియు, నంతవిరివితోడ నతిశయిల్లు
దృష్టిగోచరములు దివియును భునియును, గాన నెందుఁ జూడఁ గడలు లేవు.[5]

145


వ.

అట్టిభూమండలంబునకు లక్షయోజనంబుల సూర్యమండలంబు దివాకరునకుఁ
జంద్రునకు నంతియదూరంబు సోమమండలంబుమీఁద నక్షత్రమండలం బన్ని
యోజనంబులు దానికి రెండులక్షలయోజనంబులు బుధమండలంబు బుధమండ
లంబున కంతియదూరంబు శుక్రమండలంబు శుక్రమండలంబునకుఁ దావత్ప్ర
మాణంబున నంగారకమండలంబు దానికి రెండులక్షలయోజనంబుల బృహస్ప
తిమండలంబు దానికిఁ దదీయప్రమాణంబున శనైశ్చరమండలంబు దానికి శతస
హస్రయోజనంబుల సప్తర్షిమండలంబు దానికి నంతియదూరంబున.[6]

146


శా.

వైభూత్యాధికుఁడై చరాచరతతు ల్వర్ణింప నుద్యత్తపో
లాభప్రాప్తి సహస్రదివ్యయుగము ల్కల్పాంతరస్థాయిగా
భూభాగగ్రహతారకామునిపదంబుల్ క్రింద వర్తింప మే
ధీభూతుం డగుచున్ ధ్రువుం డమరు జ్యోతిశ్చక్రసంయుక్తుఁడై.[7]

147


వ.

అట్టిధ్రువమండలంబునకుఁ గోటియోజనంబుల మహర్లోకంబును దదీయద్విగుణితం

  1. కోపప్రసాదగుణములు = కోపగుణమును శాంతిగుణమును, దీపింపన్ = వెలుఁగఁగా - ప్రకాశింప.
  2. ప్రతిపాదనంబు = చెప్పుట - స్వరూపమును నిరూపించి చెప్పుట.
  3. విస్పష్టముగాన్ = విశదముగా.
  4. పంకజ...రుచులు = సూర్యచంద్రులకాంతులు, సాగర...కుంభిని = సముద్రములతోడను పర్వతములతోడను దీవులతోడను గూడిన భూమి.
  5. నింగియున్ = ఆకాశమున్, కడలు = తుదలు.
  6. తావత్ప్రమాణంబునన్ = అంతటిమేరను.
  7. వైభూత్యాదితుఁడు = ఐశ్వర్యముచేత అధికుడు, ఉద్య...ప్రాప్తిన్ = అతిశయించిన తపఃఫలము కలిమిచేత, కల్పాంతరస్థాయిగాన్ = మరియొకప్రళయమువఱకైన నిలుకడ కలవాఁడుగా, క్రింద వర్తింపన్ = తనకుదిగువ నుండఁగా, మేధీభూతుండు = మేధిగా చేయఁబడినవాఁడు - చలించనియునికి గలవాఁ డనుట, (మేధి = కళ్లములో పసులను గట్టుటకు పాఁతినమేకు) జ్యోతిశ్చక్రసంయుక్తుఁడు = జ్యోతీరూపములైన నక్షత్రములకు ఉనికిపట్టైన చక్రముతో కూడుకొన్నవాఁడు.