పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

స్వాయంభువాదిమతములఁ, బ్రాయశ్చిత్తంబు లేనిపాతకములకుం
బ్రాయశ్చిత్తం బగు నా, రాయణనామైకసంస్మరణము మునీంద్రా.[1]

134


సీ.

అధ్యాత్మవిదులచే నడఁగనిదురితంబు దానముల్ చేసినఁ బోనికీడు
ఘనతపోనియతిఁ గ్రాఁగనికలుషంబులు జపము చేసిన నశించనియఘంబు
లుపవాసములచేత నుడివోనికలుషముల్ పరహితంబులఁ బోనిపాతకములు
వ్రతములచేత నొవ్వనిదుష్కృతంబులు క్రతువులఁ బొలియనికల్మషములు


తే.

దేవపూజలఁ బొలివోనికావలములు, బ్రాహ్మణోపాస్తిఁ జెడిపోనిపాపచయము
లచ్యుతానంత గోవింద హరి మురారి, యని తలంచిన యప్పుడే యడఁగిపోవు.[2]

135


మ.

నుతభక్తిన్ మనుజుండు తా జపతపోనుష్ఠానధర్మక్రియా
గతుఁడై విష్ణు భజింపఁగా నతనికిం గైవల్యభోగంబు న
చ్యుతమై యింద్రపదంబు గల్గుటఁ దదుద్యోగార్చనాకర్మముల్
శతసాహస్రము లైనవిఘ్నములతో సంధిల్లఁబోలుం జుమీ.[3]

136


చ.

హరి భజియించి నిత్యముఁ దదర్చన చేసి కృతార్జుఁ డైనయా
నరులకు నాకపృష్ఠగమనం బగుఁ జూవె యధఃపథంబునన్
మరలుట లింద్రభోగములు మానిన నంతకు నెక్కుడైనచో
మరిగి వసించుగాని మఱి మానుషభావముఁ బొందఁ డెన్నఁడున్.[4]

137


ఉ.

ఇమ్ముగ భక్తిబీజ మన నెన్నిక కెక్కినవాసుదేవనా
మంబు దివానిశంబు గరిమం జపియించునరుండు విష్ణులో
కంబున నుండుఁగాని నరకంబునఁ గూలఁడు వాని కెన్నిజ
న్మంబులనైనఁ బాపములు నాటవు పుణ్యపరుండు గావునన్.[5]

138


క.

కోపప్రసాదగుణములు, పాపంబును బుణ్యఫలము బహుసుఖదుఃఖ

  1. నారాయణనామైకస్మరణము = ఒక్కటియైన నారాయణనామమును స్మరించుట - నారాయణనామమునే పలుమాఱు తలఁచుచుండుట.
  2. అధ్యాత్మవిధులచేన్ = తత్వానుసంధానక్రియలచేత, దురితము = పాపము, కీడు = చెఱుపు - పాపము, క్రాఁగనికలుషములు = నశింపనిపాపములు, ఆఘము = పాపము, ఉడివోని = చెడని, పరహితంబులన్ = పరోపకారములచేత, నొవ్వని = బాధనొందని - చెడని, పొలియనికల్మషములు = నశింపనిపాపములు, పొలివోనికావలములు = నశించనిపాపములు, బ్రాహ్మణోపాస్తి = బ్రాహ్మణపూజ.
  3. నుత = కొనియాడఁబడిన, ధర్మక్రియాగతుఁడు = పుణ్యకర్మలను పొందువాఁడు - పుణ్యకర్మలను చేయువాఁ డనుట, భజింపఁగాన్ = సేవింపఁగా, అచ్యుతము = జాఱనిది - తొలఁగనిది, తదుద్యోగార్చనాకర్మములు = వానియొక్క ప్రయత్నపూర్వకములైన పూజాకృత్యములు.
  4. నాకపృష్ఠగమనంబు = స్వర్గమునకు మీఁది మార్గమున పోవుట, అగుఁజూవె = కలుగునుజుమీ, అధఃపథంబునన్ = క్రిందిమార్గమున, అంతకున్ = ఆయింద్రలోకమునకంటె, మరిగి = పరిదయము గలిగి.
  5. బీజము = విత్తు - పుట్టుకకు హేతువు, ఎన్నికకున్ - గణనకు - ప్రసిద్ధికి, దివానిశంబు = పగలును రేయును, గరిమన్ = గురుత్వముతో.