పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ధర నౌరభ్రకమృగయులు, స్థిరవహ్నిజ్వాలఁ గూలి చిక్కుదురు సుమీ.[1]

124


క.

వ్రతలోపం బొనరించిన, యతఁడు నిజాశ్రమము విడుచునతఁడును బాక
చ్యుతిఁ జేసి కుడుచునాతఁడు, సతతము గూలుదుకు సూవె సందంశమునన్.

125


ఆ.

పగలు నిద్రవోవు బ్రహ్మచారియు దివా, స్ఖలితమతియు మిత్రఘాతుకుండు
నాశ్రితఘ్నుఁ డైనయధమాధముుండు శ్వ, భోజనమునఁ గూలి పోదు రనఘ.[2]

126


వ.

ఇవ్విధంబురం జెప్పబడినరకంబులకంటే నత్యంతదారుణంబు లైనదుర్గతు లనేక
శతసహస్రంబులు గలవు. అందు నత్యంతదుష్కృతకర్ము లైనమానవులు యాత
నాగతులై పడియుండుదు రవియన్నియు నొకటికొకటి కనుభవహేతుభూతంబు
లై యుండు మఱియును.[3]

127


క.

పాతకము లెన్ని నరక, వ్రాతంబులు నన్ని గలవు వానివలన హీ
నాతిశయంబులు లేక సు, ఖాతీతములై భయంకరాకృతి నుండున్.[4]

128


క.

నరకముల నున్నవారలు, సురల నధోవదను లగుచుఁ జూతురు సురలున్
నరకస్థులఁ జూతు రధ, శ్శిరములతో నెల్లప్రొద్దుఁ జెచ్చెరఁ దమలోన్.[5]

129


ఆ.

పుణ్యపరులు స్వర్గమున కెట్టు లరుగుదు, రట్ల పాపకర్ము లైనవారు
ఘోరమైన నరకకూపనివాసులై, యవధి లేక యుందు రనఘచరిత.[6]

130


క.

హృదయమునకు సంతోషం, బొదవుట స్వర్గంబు దుఃఖ మొందుట నరకం
బది వినుము మేలు గీడును, సదమలయశ స్వర్గనరకసంజ్ఞలు సుమ్మీ.[7]

131


క.

ఏపునఁ దమదుష్కృతములఁ, బాపఁగ నర్హంబు లైన ప్రాయశ్చిత్త
వ్యాపారంబులు విడిచిన, పాపాత్ములు నరకలోకపతితులు సుమ్మీ.[8]

132


వ.

తొల్లి స్వాయంభువాదు లైనమనువులును మహామునులును మనుష్యులపాత
కంబులకుం దగినప్రాయశ్చిత్తంబులు సకలలోకోపకారకంబులుగాఁ గల్పించి
రట్టిప్రాయశ్చి త్తవిధులవలనఁ బాపంబు లుపశమించుఁ బాపరహితులు పుణ్యలో
కసుఖంబు లనుభవింతురు వినుము.

133
  1. వనిన్ = వనమును, లోఁబఱచిన నరుఁడు = తక్కువపడఁజేసిన మనుష్యుఁడు - మాలవేయుట మొదలగువానికై పూచి కాచియుండు వృక్షములను నఱికిన మనుష్యుఁడు, ఔరభ్రకమృగయులు = గొఱ్ఱెలను మేపి జీవించువాఁడును వేఁటాడి జీవించువాఁడును.
  2. దివాస్ఖలితమతి = పగలు రేతస్సును కార్చునట్టి బుద్ధిగలవాఁడు, మిత్రఘాతుకుఁడు = మిత్రుని జెఱుచువాఁడు, ఆశ్రితఘ్నుఁడు = తన్ను ఆశ్రయించినవానిని చెఱుచువాఁడు.
  3. దారుణంబులు = భయంకరములు, దుర్గతులు = నరకములు, దుష్కృతకర్ములు = పాపకర్ములు, యాతనాగతులు = తీవ్రవేదనను పొందువారు, హేతుభూతంబులు = కారణములైనవి.
  4. హీనాతిశయములు = తక్కువ యెక్కువలు, సుఖాతీతములు = సుఖమును అతిక్రమించినవి - సుఖము లేనివి.
  5. అధోవదనులు = తలక్రిందైన మొగములు గలవారు, నరకస్థులన్ = నరకములయం దుండువారిని, అధశ్శిరములతోన్ = క్రిందికి వంపఁబడిన మొగములతో, ఎల్లప్రొద్దున్ = సర్వకాలమును.
  6. నరకకూపనివాసులు = నరకము లనెడు నూతులయందు వసించువారు, అవధి = మేర.
  7. సదమలయశ = నిర్మలమైన కీర్తిగలవాఁడా, సంజ్ఞలు = పేళ్లు గలవి.
  8. ఏపునన్ = గర్వముతో, దుష్కృతములన్ = పాపములను, పతితులు = పడినవారు.