పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శేషుఁ డత్యంతభాషావిశేషుఁ డగుచు, భూరిభూమండలం బెల్లఁ బూనియుండు.[1]

100


క.

కైలాసనగముమీఁదను, గ్రాలెడునా కాశగంగ కాలువలవిధం
బై లాంగలముసలము లిరు, గేలులఁ గనుపట్టు నతనికిని దివ్యములై.[2]

101


క.

అతఁ డొక్కొకపరి కోపో, ద్ధతుఁ డైనవిశేషతద్వదననిశ్వాస
ప్రతతులచేతఁ జరాచర, తతులకుఁ బాటిల్లుఁ బ్రళయదహనక్రీడల్.[3]

102


క.

ఆపరముఁడు సంకర్షణ, రూపంబున నుండు నాదిరుద్రుండై తా
గోపించినపుడు ప్రళయము, దీపించు జగంబులెల్లఁ దెగు నందఱితోన్.[4]

103


శా.

హాలాపానమదోద్ధతిన్ ఫణివిభుం డత్యంతఘూర్ణాయమా
నాలంకారకటాక్షవీక్షణయుతుండై దేహ ముబ్బంగ భో
గాలిన్ విస్తృతిఁ బొందఁజేసిన సదైత్యామర్త్యమర్త్యంబుగా
నోలిన్ లోకములన్నియున శిరమునం దుఱ్ఱూఁత లూఁగున్ వెసన్.[5]

104


వ.

ఇవ్విధంబున నమ్మహానుభావుండు సకలసరిత్సాగరపర్వతద్విపమహారణ్యసమేతం
బును జరాచరభూతసంచారంబును బంచాశత్కోటియోజనవిస్తారంబును నైన
భూమండలంబు శిరోమండనం బైనపూవుదండచందంబున నందంబుగా
భరియించు.[6]

105


క.

ఈక్షితిమండలమంతయు, నక్షీణప్రౌఢి దాల్చునట్టిమహిమ యా
చక్షుశ్శ్రువునకుఁ గల్గుట, సాక్షాద్విష్ణుప్రభావశక్తియ సుమ్మీ.[7]

106


ఉ.

చంచలచారునేత్రలు భుజంగమకన్యలు సౌరభంబులన్
మించినచందనం బతనిమేన నలందుచు నుండఁ దన్ముఖా

  1. చారు...ఛాయలు = మనోహరములైన తలలకు అలంకారములై యుండెడు మాణిక్యములకాంతులు, సందడించ = వ్యాపింపఁగా, దివ్య...చయము = దివ్యమైన మద్యపానమువలని మత్తుచేత సొంపుగలిగి తిరుగుడుపడుచున్న కంటినల్లగ్రుడ్లగుమి, నృత్యములు సలుపన్ = నాట్యమాడుచుండఁగా, నానాసౌరభములు = అనేకములైన కిరీటములయందు ఉంచఁబడిన పువ్వులపరిమళములు, రాయడించన్ = ఒరసికొనఁగా, శరదభ్రధాళధళ్యములు = శరత్కాలమేఘములవలె తెల్లవై చలింపనిదేహముయొక్క స్ఫురత్త్తెన తళతళనికాంతులు, బిత్తరముజాడన్ = విలాసముగా వీక్షింపఁగా, నిబిడ...అంకుశములన్ =దట్టమైన మొలను ధరింపఁబడిన నీలవస్త్రముయొక్క కాంతులచేత, చిమ్మచీఁకట్లు = చిఱుచీఁకట్లు, గ్రమ్మన్ = కమ్ముకొనఁగా, భాషావిశేషుఁడు = మాటలచేత మించినవాఁడు, భూరిభూమండలంబు = విస్తారమైన భూగోళమును పూని - వహించి.
  2. క్రాలెడు = ఒప్పునట్టి, లాంగలముసలములు = నాగేలును రోకలియు, ఇరుగేలులన్ = రెండుచేతులందును, కనుపట్టున్ = కనఁబడును - ఉండుననుట.
  3. ఒక్కొకపరి = ఒక్కొక్కసారి, ఉద్ధతుఁడు = నిక్కినవాఁడు, తద్వదన...చేతన్ = ఆతనియొక్క ముఖములవలని నిట్టూర్పుసమూహములచేత, పాటిల్లున్ = కలుగును, ప్రళయదహనక్రీడలు = ప్రళయకాలమునందలి అగ్నియొక్క లీలలు.
  4. పరముఁడు = శ్రేష్ఠుఁడు, తెగున్ = నశించును.
  5. హాలాపానమదోద్ధతిన్ = మద్యపానముచేతఁ గలిగిన మత్తువలని నిక్కుచేత, ఫణివిభుండు = సర్పరాజు - శేషుఁదు, అత్యంత...యుతుండై = మిక్కుటముగఁ ద్రిప్పఁబడుచున్న అందమైన కడకంటిచూపులతోఁ గూడుకొన్నవాఁడై, ఉబ్బంగన్ = ఉప్పొంగఁగా, భోగాలిన్ = పడగలవరుసను, విస్తృతిఁ బొందఁజేసినన్ = విరియఁజేసినను, సదైత్యామర్త్యమర్త్యంబుగా = దైత్యులతోడను బ్రాహ్మణులతోడను మనుష్యులతోడను గూడుకొన్నది యగునట్టుగా, ఓలిన్ = వరుసగా, ఉఱ్ఱూఁతలూఁగున్ - ఉఱ్ఱట్లూఁగును.
  6. పంచాశత్కోటియోజనవిస్తారంబు = ఏఁబదికోట్ల ఆమడల విరివి గలది, శిరోమండనంబు = శిరోభూషణము.
  7. అక్షీణప్రౌఢిన్ = తగ్గనిసామర్థ్యముచేత, చంక్షుశ్శ్రవున్ = పామునకు - శేషునికి.