పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్రీకముగఁ జుట్టి యుండును, శాకద్వీపంబు భవ్యసంరక్షితమై.[1]

71


మ.

అతులప్రాభవవైభవానుభవరాజ్యశ్రీలచే ధన్యుఁడై
యతఁ డాద్వీపము నేడుభాగములుగా వర్థి న్విభాగించి యా
త్మతనూసంభవసప్తకంబునకు నిత్యప్రీతితో నిచ్చె నా
క్షితిపవ్రాతముపేర వర్షములుగాఁ జెల్వొందె నాదేశముల్.[2]

72


వ.

వానినామంబులు వినుము జలద కుమార సుకుమార మరీచక కుసుమోద
సుమోద మహాద్రుమంబు లనంబరఁగు నద్దేశంబులకు మర్యాదాపర్వతంబులై
యుదయజలధరరైవతాంభోంబికేయరమ్యకేసరీపర్వతంబులు మెఱయు. తదీ
యోద్భవంబులై కుమారియును సుకుమారియును నలినియును వేణుకియును
ఇక్షువును ధేనుకయును గభస్తియు ననుమహానదులు ప్రవహించియుండు.

73


క.

ఆయాఱుదీవులం గల, యాయావర్తంబులందు నతులమహిమలం
బాయనియేఱులు శైలని, కాయంబులు పెక్కువేలు గలవు మునీంద్రా.[3]

74


సీ.

అట్టిశాకద్వీపమందుఁ జాతుర్వర్ణసముదయంబులు పుణ్యజనపదములుఁ
బుణ్యదేశములు నగణ్యంబు లదియు భౌమస్వర్గ మచ్చటిమనుజులందు
ధర్మంబెకాని పాతక మించుకయు లేదు మర్యాద లుడిగిన మనికి యొల్ల
రన్యోన్యవైరంబు లాత్మల భావింపఁ గడఁగరు హీనాధికములు లేవు


తే.

మంగమాగధమానసమందగు లన, బ్రాహ్మణాదివర్ణంబు లుపన్యసింపఁ
బడుదివాకరమూర్తియై పద్మనాభుఁ, డచట యజ్ఞంబులను బూజ లందుచుండు.[4]

75


క.

శాకమహీజముపేరను, శాకద్వీపంబు నాఁగ సన్నుతి కెక్కున్
లోకస్తుత యాదీవికి, నాకడ దుగ్ధాబ్ధి మెఱయు నంతియ విరివిన్.[5]

76


ఆ.

ఆపయఃపయోధి యవ్వలదానికి, ద్విగుణగణిత మైనవిస్తరమున
నమరియుండుఁ బుష్కరాఖ్యమహాద్వీప, మచటిమహిమ చెప్ప నలవిగాదు.

77


సీ.

ఆపుష్కరద్వీప మర్థితోఁ బాలించె సవనుఁ డారాజన్యచంద్రునకును
వీరయుక్తుఁడు మహావీరధాతకుఁ డన నిరువురు పుట్టి రయ్యిరువురకును
సమభాగములుగ రాజ్యముఁ బంచిపెట్టిన దానికి మానసోత్తరనగంబు
మర్యాద యగును నమ్మధ్యభాగంబునఁ బరివేషమునుబోలెఁ బరఁగియుండు

  1. ఆకడన్ = ఆవల, తద్విగుణ...శ్రీకముగన్ = దానికి రెండంతలుగా గుణింపఁబడినదై విరివి కలిమిగలదిగా - దానికి రెండంతలవిరివి గలదిగా.
  2. ఆకుల...శ్రీలచేన్ = సరిపోల్పరాన్ని ప్రభుత్వముయొక్క ఐశ్వర్యమును అనుభవింపఁగలరాజ్యసంపదచేత, ఆత్మ...సప్తకంబునకున్ = కొడుకు లేడుగురకును.
  3. శైలనికాయంబులు = కొండలసమూహములు.
  4. చాతుర్వర్ణసముదయంబులు = బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రు లనెడు నాలుగువర్ణములయొక్క సమూహములు, జనపదములు = పట్టణములు లేక గ్రామంబులు, అగణ్యంబులు = లెక్కింప నలవిగానవి, భౌమస్వర్గము = భూమిసంబంధియైన స్వర్గము, మనికి = ఉనికి, ఒల్లరు = అపేక్షింపరు, కడఁగరు = యత్నింపరు, ఉపన్యసింపఁబడున్ = చెప్పఁబడును, దివాకరమూర్తి = సూర్యమూర్తి.
  5. శాకమహీజము = శాకవృక్షము, ఆకడన్ = అవతల.