పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వర్షసప్తకంబు వర్ణింప నాదీవి, యందు వినుతికెక్కె ననఘచరిత.[1]

61


క.

ఆదేశంబులకును మ, ర్యాదాగిరు లగుచు విద్రుమాగద్యుతిమా
నాదిత్యపుష్పవంతకు, శాదహరానందమందరాద్రులు మెఱయున్.

62


క.

శివయును విధూతపాపయుఁ, బవిత్రయును సుమతియునుం బాపహరయు హై
మవతియును విద్యుదంభయ, నవతీర్ణములయ్యె నేఱు లాశైలములన్.[2]

63


తే.

దైత్యదానవదేవగంధర్వయక్ష, సిద్ధసాధ్యాదులును దాము చెలిమి చేసి
మనుచు నుండుదు రాదీవిమనుజులెల్ల, వర్ణసంకరములు గానినిర్ణయముల.

64


తే.

బ్రాహ్మణాదివర్ణంబులు పరఁగు దమిన, శుష్మిణస్నేహమందేహసురుచిరాభి
ధానముల బ్రహ్మరూపంబు దాల్చి శౌరి, యజ్ఞములఁ బూజ లందుచు నతిశయిల్లు.

65


క.

అంబరతల మంది కుశ, స్తంబం బాదీవి నున్నతం బైననిమి
త్తంబునఁ గాదె కుశద్వీ, పం బన లోకంబులందుఁ బ్రస్తుతికెక్కెన్.[3]

66


తే.

ఆకుశద్వీపమునకు నీడైనవిరివి, యమరి ఘృతవార్ధి పరివృతంబై తనర్చు
నాపయోనిధి కినుమడి యగువిశాల, మై చెలఁగెఁ గ్రౌంచ మన్ ద్వీప మనఘచరిత.[4]

67


సీ.

ద్యుతిమంతునకుఁ గూర్మిసుతులై మనోనుగుండును సివరుండు నుష్ణుండు నంధ
కారుండు మునియును గౌశలుండును దుందుభియు నాఁగ నేడ్గురు భీమబలులు
జనియించి యాదీవి సఫ్తవర్షంబులు గావించి యేలి రాఖండములకుఁ
తొలిమేరలై కొంచమును వామనము నంధకారంబు హయము రక్తము దివంబుఁ


తే.

బుండరీకంబు నన నుండుఁ గొండలందు, ఖ్యాతియును గుముద్వతియును గౌరియును మ
నోజవయు సంధ్యయును రాత్రియును బ్రపుండ, రీకయును నన నదు లేడు జోకఁ బరఁగు.
[5]

68


ఉ.

భూమిసురాదివర్ణములు పుష్కరపుష్కలధన్యతిష్యులన్
నామములన్ మునీశ్వర వినంబడు నచ్చట రుద్రరూపియై
శ్రీమహిళాకళత్రుఁడు వసించు మఖంబులఁ బూజలందుచున్
గామితసంపదల్ తపముఁ గైకొని చేయక గల్గ వేరికిన్.[6]

69


క.

మానుగ గ్రౌంచద్వీపస, మానవిశాలంబు గలిగి మహనీయగభీ
రానూనదధిసముద్రము, తా నాద్వీపంబుచుట్టుఁ దనరుచు నుండున్.[7]

70


క.

లోకస్తుత యాజలనిధి, యాకడఁ దద్విగుణగుణిత మైనవిశాల

  1. వర్షసప్తకంబు = ఏడువర్షములు, అనఘచరిత = పాపరహితమైన నడవడి గలవాఁడా.
  2. అవతీర్ణములు = దిగినవి - ప్రవహించినవి.
  3. అంబరతలము = ఆకాశప్రదేశము, కుశస్తంబంబు = దర్భగంట.
  4. ఈడు = సమానము, ధృతవార్ధిపరివృతంబు = నేతిసముద్రముచేత చుట్టఁబడినది, పయోనిధిన్ = సముద్రమునకు, ఇనుమడి = ఇబ్బడి - రెండంతలు.
  5. జోకన్ = ఒప్పిదముగా.
  6. శ్రీమహిళాకళత్రుఁడు = లక్ష్మీపతియైన శ్రీహరి, కామితసంపదలు = కోరినకలుములు.
  7. మానుగన్ = ఒప్పిదముగా - సరిగా ననుట, మహ...సముద్రము = గొప్పదియై లోఁతుచేత తక్కువగాని పెరుగుసముద్రము, తనరుచున్ = అతిశయించును.