పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గృతయుగాద్యవస్థలు లేవు సతతమును మ, నోహరములైన రాజధానులు వనములు
నంబుజాకరములు నెన్నియైనఁ గలవు, ఇందురూపంబుతో నుండు నందు శౌరి.[1]

51


క.

అందుల నార్యకకురరక, విందకభావినులు నాఁగ విప్రమహీభృ
ద్బృందంబులు విట్ఛూద్రులు, నందంబుగఁ బిలువఁబడుదు రాదేశమునన్.[2]

52


క.

జంబూవృక్షముతోడ స, మంబగునున్నతము గల్గి మహనీయప్ల
క్షం బొప్పుం బ్లక్షద్వీ, పం బన నాతరువు పేరఁ బరఁగు మునీంద్రా.

53


క.

ప్లక్షద్వీపము నవ్వల, నక్షీణగభీరతామహత్వంబులతో
నిక్షురసవార్ధి మెఱయును, లక్షద్వయయోజనంబులవిశాలంబై.[3]

54


సీ.

ఆయిక్షురసవార్ధి యవ్వల శాల్మలద్వీపము మెఱయు నాదీవివిరివి
నాల్గులక్షలయోజనంబులు దాని వపుష్మంతుఁ డేలు నాభూమివిభుని
సుతు లైరి శ్వేతహరితులు జీమూతరోహితులు సుప్రభుఁడు వైద్యుతియు మాన
సుఁడు నాఁగ నేడ్వు రాక్షోణీశ్వరులపేర వర్షంబులై వారివారిదేశ


తే.

ములు మెఱయు వానినడుమ గుముదము నుష్ణ, మును వలాహకమును ద్రోణమును మహిషముఁ
గంకమును గకుద్వస్తనగంబు నాఁగ, సప్తకులపర్వతములు ప్రశస్తి నొందు.

55


క.

స్మయనాశలయ్యు యోనిజ, యు యమాయామియును దృష్ణయును జంద్రయు శు
క్రయు నిర్వీర్యయును విమో, హియు నన నాగిరులఁ బుట్టె నీనదు లేడున్.[4]

56


తే.

బ్రాహ్మణాదులు కపిలచారణకపీత, కృష్ణనామంబులు వహించి కీర్తిఁ బరఁగు
చుండుదురు వాయురూపియై పుండరీక, నయనుఁ డాదీవియందు నున్నతి వహించు.[5]

57


క.

విను మేకాదశశతయో, జనములయున్నతము గలిగి శాల్మలతరు వొ
ప్పును దానిపేర లోకము, లను వినుతికి నెక్కె శాల్మలద్వీప మనన్.[6]

58


తే.

 శాల్మలద్వీపమంతవిస్తరముతో సు, రాంబునిధి చుట్టుకొనియుండు నాపయోధి
యవ్వలను దాని కినుమడి యైనవిరివిఁ, దేజరిల్లుచు నాకుశద్వీప మమరు.[7]

59


క.

ఖ్యాతిగ తద్ద్వీపము మును, జ్యోతిష్మంతుండు తనదుసుతు లేడ్వురకుం
బ్రీతిమెయిఁ బంచిపెట్టిన, నాతనయులపేరఁ బరఁగు నావర్షంబుల్.

60


ఆ.

వేణుమాల లంబనోద్భిదస్వైరధ, కపిలవిధృతిభానుకరము లనఁగ

  1. మానవతతులు = మనుష్యసమూహములు, నిరత...హృదయులై = ఎల్లప్పుడు సంతుష్టి నొందిన మనసు గలవారై, దుర్వివేకము = చెడ్డతెలివి - మూర్ఖత యనుట, అంబుజాకరములు = సరస్సులు, ఇందురూపంబుతోన్ = చంద్రాకృతితో.
  2. మహీభృద్బృందంబులన్ = రాజసమూహములు, విట్ఛూద్రులున్ = వైశ్యులును శూద్రులను.
  3. ప్లక్షము = జువ్విమాను, అక్షీణ...మహత్వంబులతోన్ =తగ్గనిలోఁతుతోడను గొప్పతనముతోను, ఇక్షురసవార్ధి = చెఱకుపాలసము ద్రము.
  4. స్మయనాశలు = భ్రమతను పోఁగొట్టునని.
  5. పుండరీకనయనుఁడు = విష్ణువు.
  6. శాల్మలతరువు = బూరుగుమాను.
  7. సురాంబునిధి = కల్లుసముద్రము, పయోధి = సముద్రము, ఇనుమడి = రెండింతలు.