పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఆరసంబు సోఁకి నచ్చటిమన్నెల్ల, గాంచనంబ యట్టికారణమున
జగతిఁ బసిఁడిపేరు జంబూనదం బన, సుప్రసిద్ధమయ్యె విప్రముఖ్య.[1]

31


వ.

మఱియుఁ జైత్రరథగంధమాదనవైభ్రాజితనందనంబు లనునుపవనంబులు నరుణా
ధరమహాపద్మనీలోదకమానసంబు లనుసరోవరంబులును గనకశైలంబునకుఁ
బూర్వంబుమొదలుగా నాలుగుదిక్కులను నిలింపులకు నిత్యోపభోగంబులై
యుండు నమ్మేరుకర్ణికకుఁ గేసరంబులై పూర్వభాగంబున సితాంభముద్వత్కుర
రీమాల్యవద్వైకంకప్రముఖంబు లైనపర్వతంబులును దక్షిణంబునఁ ద్రికూటశిశి
రపతంగరుచకనిషధాదు లైనశైలంబులును బశ్చిమంబున శిఖివాసోవైడూర్యకపిల
గంధమాదనజారుధులు మొదలైననగంబులును నుత్తరంబున శంఖకూటవృషభ
హంసనాగకాలాంజనంబులు లోనుగాఁ గల కొండ లనేకంబులు నుండు.[2]

32


చ.

కనకనగంబుమీఁదఁ ద్రిజగన్నుతమై పదునాల్గువేలయో
జనములసంఖ్య నాయతవిశాలములై కనుపట్టుచుండు న
య్యనిమిషరాజధాని సముదంచితకాంచనరత్నగోపురా
ద్యనుపమరమ్యహర్మ్యవివిధావరణప్రకరప్రసిద్ధమై.[3]

33


వ.

మఱియు విష్ణుపాదవినిష్కాంతయు శశాంకమండలప్లావయు నైనయాకాశ
గంగ చతుర్భేదంబై సీతయు నలకనందయుఁ జక్షువును భద్రయు నన నమరా
వతి నాల్గుదిక్కులం బ్రవహించి.[4]

34


తే.

ఖ్యాతి భద్రాశ్వభారతకేతుమాల, కురుమహావర్షముల మహీసరసిజంబు
నందు ఱేకులమర్యాద లైనగిరుల, బాహ్యభూములయందుఁ జూపట్టుచుండు.[5]

35


వ.

ఇత్తెఱంగున నాల్గుదెసల సీతాదివాహినీచతుష్టయంబు ప్రత్యంతపర్వతంబుల
నడుమఁ బ్రవహించి యతిమనోహరంబై యుండు మఱియు సిద్ధచారణసేవితంబు
లగుపురంబులు గాననంబు లనేకంబులు గల వవి లక్ష్మీవిష్ణుసూర్యాదిదేవతలకు
నివాసంబు లై యుండు గంధర్వయక్షరాక్షసాదులు నిరంతరవినోదంబులం

  1. కాంచనంబ = బంగారే, పసిఁడి = బంగారు.
  2. నిత్యోపభోగంబులు = ఎల్లప్పుడు పొందుచున్న భోగములు గలవి.
  3. అనిమిషరాజధాని = దేవతలపట్టణము, సముదంచిత...ప్రసిద్ధమై = మిక్కిలి యొప్పిదమైన బంగారుచే రత్నములు పొదిఁగి కట్టబడిన గోపురములు మొదలైనవానిచేతను ఈడు లేని మనోజ్ఞములైన మేడలు మొదలైవవానిచేతన నానావిధములైన ఆవరణములచేతను ప్రసిద్ధిపొందినదై.
  4. విష్ణుపాదవినిష్క్రాంత = విష్ణువుయొక్క అడుగులనుండి వెడలినవి, శశాంకమండలప్లావ = చంద్రమండలమును తడుపునది, చతుర్భేదంబు = నాలుగుభేదములు గలది.
  5. మహీసరసిజంబునందు = భూమియనెడు కమలమునందు, ఱేకులమర్యాదలు = ఱేకులయొక్క క్రమము గలవి, బాహ్యభూములయందున్ = బయటినేలలయందు.