పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జూపట్టు యక్షకిన్నర, తాపసగంధర్వదేపతాసేవ్యంబై.[1]

22


ఆ.

ఎనయ శీతగిరియు హేమకూటంబును, నిషధపర్వతంబు నింగి మోచి
తనరు మేరునగము దక్షిణభాగంబు, నందుఁ బూర్వపశ్చిమాయతముల.[2]

23


క.

నీలాచలమును సితకు, త్కీలంబును శృంగ మనఁగ క్షితిధరము నిలిం
పాలయనగోత్తరంబునః, గ్రాలుం బూర్వాపరములఁ గడుదీర్ఘములై.[3]

24


వ.

ఒక్కొక్కపర్వతంబు రెండువేలయోజనంబులు విస్తారోన్నతంబులు గలిగి
యుండు దక్షిణోత్తరాయతంబు లైనమర్యాదాపర్వతంబులు తూరుపున దేవ
కూటంబును బడమట జరఠపర్వతంబు నుండు వానినడుమఁ గనకాద్రిచతుర్భా
గంబుల వర్షంబులు విలసిల్లు నెట్లనిన మేరుపర్వతంబునకు దక్షిణంబున భారతకిం
పురుషహరివర్షంబులు మూడురు, ఉత్తరంబున రమ్యకహిరణ్మయకురువర్షంబులు
మూఁడును, తూర్పున భద్రాశ్వవర్షంబును, పడమటఁ గేతుమాలావర్షంబును,
వానినడుమ మేరుచతుర్భాగంబులఁ దొమ్మిదివేలయోజనంబుల విశాలంబై
యిలావృతవర్షంబును మెఱయు మఱియును.[4]

25


తే.

మందరము తూర్పునను గంధమాదనంబు
దక్షిణంబున విపులభూధరము పశ్చి
మమునఁ బార్శ్వపర్వత ముత్తరమున మెఱయు
హేమధాత్రీధరంబున కివ్విధమున.

26


తే.

ఆనగోన్నతశృంగంబులందు మెఱయు, బోధిజంబూకదంబన్యగ్రోధతరువు
లేచి వేయింటిమీఁద నూఱేసియోజ, నములు పొడవున ఘనకేతనములువోలె.[5]

27


క.

జంబూవృక్షము పేరను, జంబూద్వీపం బనంగ జగములను బ్రసి
ద్దంబు వహించె న్దద్వృ, క్షంబుఫలంబులు మహాగజప్రతిమంబుల్.[6]

28


తే.

ఆఫలంబులు హేమకూటాచలంబు, సానుభూములఁ దఱుచుగాఁ జదియఁబడి ర
సంబు ప్రవహించి జాంబూనదం బనంగ, మేరుశైలంబుచుట్టును మెఱసి యుండు.[7]

29


ఉ.

ఆరసపానులై గరిమ నచ్చటఁ ద్రిమ్మరుచున్నవారికి
న్జేేరవు రోగము ల్చెమట చెందదు మేనులఁ బూతిగంధము
న్ఘోరజరాదిదోషములుఁ గూడవు ఖేచరవృత్తి గల్గి యొ
ప్పారుదు రింద్రియోల్బణ మొకప్పుడు పుట్టదు తాపసోత్తమా.[8]

30
  1. భూపద్మమునకున్ = పద్మాకారమైనభూమికి, కర్ణికాకారమునన్ = దుద్దువంటి యాకృతితో, చూపట్టున్ = కనఁబడును, సేవ్యంబై = సేవింపఁదగినదై.
  2. నింగి మోచి = ఆకాశము నంటి.
  3. సితకుత్కీలంబు = తెల్లకొండయు, నిలింపాలయనగము = మేరుపర్వతము, క్రాలున్ = ప్రకాశించును.
  4. మర్యాదాపర్వతంబులు = ఎల్లలుగా నుండు కొండలు, చతుర్భాగంబులన్ = నాలుగుతట్టులను.
  5. బోధిజంబూకరంబన్యగ్రోధతరువులు = రావి నేరేడు కడిమి మఱ్ఱి మ్రాఁకులు.
  6. ప్రతిమములు = సమానములు.
  7. సానుభూములన్ = చఱులనేలలయందు, చదియఁబడి = నలఁగునట్లుగా బడి.
  8. పూతిగంధము = గదురుకంపు, ఘోరజరాదిదోషములు = భయంకరమైనముసలితనము మొదలైనలోపములు, ఖేచరవృత్తి = ఆకాశమునందు తిరిగెడు వర్తనము, ఇంద్రియోల్బణము = రేతస్సు యొక్క ఉబుకుట.