పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

శ్రీవిష్ణుపురాణము

తృతీయాశ్వాసము


చతురకీర్తినయధ
ర్మోచితకారుణ్యలబ్ధగురువైష్ణపధ
ర్మాచరణహృదయ సుమనా
రాచప్రతిమానరూప రాఘవభూపా.[1]

1

ప్రియవ్రతునివంశానువర్ణనము

వ.

సకలవిద్యాధురంధరుం డైనపరాశరుండు మైత్రేయుని కిట్లనియె. స్వాయంభువనం
దనుం డైన ప్రియవ్రతుండు కర్ధ ప్రజాపతిపుత్రి కుక్షి యనుదానిఁ బాణిగ్రహ
ణంబు చేసి దానియందు నాగ్నీధ్రుండును మేధాతిథియును వపుష్మంతుండును
జ్యోతిష్మంతుండును ద్యుతిమంతుండును హవ్యుండును సవనుండును మేధుం
డును నగ్నిబాహుండును బుత్రుండును ననుకుమారులఁ బదుండ్రం గాంచె.
వారియందు.[2]

2


క.

మేధాగ్నిబాహుపుత్రులు, సాధుజనస్తుతులు ముగురు జాతిస్మరులై
యీధర నేలఁగ నొల్లక, సాధించిరి దివ్యయోగసంపద లెల్లన్.[3]

3


వ.

తక్కినకుమారసప్తకంబునం దాగ్నీధ్రునకు జంబూద్వీపంబును, మేధాతిథికిఁ
బ్లక్షద్వీపంబును, వపుష్మంతునకు శాల్మలద్వీపంబును, జ్యోతిష్మంతునకుఁ గుశ
ద్వీపంబును, ద్యుతిమంతునకుఁ గ్రౌంచద్వీపంబును, హవ్యునకు శాకద్వీపంబును,
సవనునకుఁ బుష్కరద్వీపంబును విభజించి యిచ్చి రాజ్యాభిషిక్తులం జేసిన.

4


శా.

ఆభూపాలశిఖామణుల్ చటులబాహాగర్వదుర్వారశో
భాభూరిప్రతిభాప్రతాపముల సప్తద్వీపసామ్రాజ్యల

  1. శ్రీ... హృదయ = సంపత్ప్రదమును చతురత కలదియు కీర్తికిని నీతికిని పుణ్యమునకును తగినదయచేత పొందఁబడిన ఘనమైన వైష్ణవధర్మమును నడపునట్టిదియు నైన మనసు గలవాఁడా, సుమ...రూప = మన్మథునిఁ బోలిన చక్కఁదనము గలవాఁడా.
  2. పాణిగ్రహణంబు చేసి = పెండ్లాడి, పదుండ్ర = పదిమందిని, కాంచెన్ = కనియెను.
  3. సాధుజనస్తుతులు = సజ్జనులచే కొనియాడఁబడినవారు, ముగురు = ముగ్గురు, జాతిస్మరులు = పూర్వజన్మస్మృతి గలవారు.