పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఖ్యానము దత్తనూభవులయన్వయసంభవు లైనరాజులం
బూని వినంగఁ గోరెదను బూర్వగతి న్వినుపింపు నావుడున్.

357


శా.

శుంభద్విక్రమవిక్రమార్క సుజనస్తోత్రైకసంపర్క సం
స్తంభీభూతరిపుప్రతాప మృదువాచాచారసల్లాప దు
గ్ధాంభోరాశిమహాగభీర విజయవ్యాపారదోస్పార ని
ర్ధంభానేకశుభప్రయోజన జగద్రమ్యార్థసంయోజనా.[1]

358


క.

సుకవిప్రణీతవాచా, సకలపురాణేతిహాససంశ్రవణ సురేం
ద్రకుమారకుమారనిభ, ప్రకటపరాక్రమ వివేకభాషాచతురా.[2]

359


స్వాగతము.

గర్వితారిలతికాలిలవిత్రా, పూర్వరాజనిభపూర్వచరిత్రా
నిర్వికారకమనీయసుగాత్రా, గిర్విలాసశుభకీర్తికళత్రా.[3]

360


గద్య.

ఇది శ్రీమదమరనామాత్యపుత్ర హరితసుగోత్ర సుకవిజనవిధేయ వెన్నెలగంటి
సూరయనామధేయప్రణీతం బైనయాదిమహావురాణం బగు బ్రహ్మాండపు
ణంబునందలి పరాశరసంహిత యైనశ్రీవిష్ణుపురాణంబునందు ధ్రువచరిత్రంబును
బృథూపాఖ్యానంబును బ్రచేతసులకథయును గంధమునితపోమహత్వంబును
బ్రహ్లాదచరిత్రంబును హరికీర్తనంబును సకలభూతసంభవంబు నన్నది ద్వితీయా
శ్వాసము.

  1. శుంభద్విక్రమవిక్రమార్క = అప్రతిహతమైన పరాక్రమముచేత విక్రమార్కుఁడా, సుజనస్తోత్రైకసంపర్క = సజ్జనులయొక్క పొగడ్తయొక్కటిచేతనే కూడుకొన్నవాఁడా, సంస్తంభీభూతరిపుప్రతాప = నిలువఁబడిపోయిన వైనశత్రువులప్రతాపము గలవాఁడా, మృదువాచాచారసల్లాప = మెత్తని మాటలతోడి సంభాషణము గలవాఁడా, దుగ్ధాంభోరాశిమహాగభీర = పాలసముద్రమువంటి అధికగాంభీర్యగుణము గలచాఁడా, విజయవ్యాపారదోస్పార = గెలుచుటయే వ్యాపారముగాఁ గలభుజబలము గలవాఁడా, నిర్దంభానేకశుభప్ర యోజన = దంభము లేని పెక్కుశుభప్రయోజనములు గలవాఁడా, జగద్రమ్యార్థసంయోజనా = లోకమునకు ఇంపైనప్రయోజనములను కూర్చువాఁడా.
  2. సుకవి...సంశ్రవణ = సత్కవులచేత కూర్పఁబడిన వాక్కులచేనైన యెల్లపురాణములయొక్కయు వినికి గలవాఁడా, సురేంద్ర...పరాక్రమ = ఇంద్రపుత్రుఁడైన యర్జునునితోడను కుమారస్వామితోడను సరిపోల్పఁదగిన ప్రసిద్ధమైన పరాక్రమముకలవాఁడా, వివేకభాషాచతురా = వివేకయుక్తములైన మాటలయందు నిపుణుఁడైనవాఁడా.
  3. గర్వి... లవిత్రా = గర్వించిన శత్రువులనెడు తీఁగలపఙ్క్తులకు కొడవలియైనవాఁడా, పూర్వ...చరిత్రా = తొల్లిటిరాజులను పోలిన పురాతనప్రవర్తనము కలవాఁడా, నిర్వి...సుగాత్రా = వికారరహితమై మనోజ్ఞమైన మంచిశరీరము గలవాఁడా, గిర్వి...కళత్రా = సరస్వతియొక్క విలాసమువలె ధావళ్యము కలిగి వెలుఁగునట్టి కీర్తియను భార్యను గలవాఁడా.