పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రాదులయాధిపత్యవివరణము

.

వ.

అది యెట్లనిన నక్షత్రగ్రహవిప్రవృక్షలతాగుల్మతపోయజ్ఞంబులకుఁ జంద్రుండును,
రాజులకు వైశ్రవణుండును, జలంబులకు వరుణుండును, ఆదిత్యుల కింద్రానుజుం
డైనవిష్ణుండును, వసువులకుఁ బావకుండును, ప్రజాపతులకు దక్షుండును, మరు
ద్గణంబులకు వాసవుండును, మునులకుఁ గపిలుండును, దైత్యదానవులకుఁ బ్రహ్లా
దుండును, పితృగణంబులకు యముండును, గజంబులకు నైరావతంబును, పక్షు
లకు గరుత్మంతుండును, మహానాగంబులకు వాసుకియు, ఆశ్వంబులకు నుచ్చై
శ్రవంబును, గోవులకు వృషభంబును, మృగంబులకు సింహంబును, వనస్పతు
లకు ప్లక్షంబును, పర్వతంబులకు హిమవంతంబును నధిపతులుగా నొనరించె ఇట్లు
సప్తద్వీపసమేతం బైనపృథివిం పృథివీపతి పాలనంబు సేయుచుండు.[1]

351


ఉ.

ఇప్పుడు చెప్పఁగాఁబడినయిందఱు విష్ణునియంశజాతులై
చొప్పడుచున్నవారు మధుసూదనమూర్తి వహింపనుండినన్
జెప్పఁగలేదు పాలనవిశేషములన్ సచరాచరంబులం
దెప్పుడు నొక్కొకొండు గలఁ డేలికధర్మము నిర్వహింపఁగన్.

352


సీ.

ఆయనర్తుపక్షమాసాబ్దకళాక్షణకాష్ఠానిమేషాదికాలములును
బంకజాతభవాండభవ్యసప్తద్వీపబహుసరిత్సాగరపర్వతములు
సురగరుడోరగాసురయక్షగంధర్వనరమునియక్షకిన్నరచయంబు
లధ్యాత్మవిద్యామహాధ్వరజపతపోమంత్రార్థగురుదేవమంత్రములును


తే.

మహితభూతవ్రజంబు తన్మాత్ర లింద్రి, యాదిగా నాదిగుణమయభేదములు న
భేదములు బుద్ధికర్మేంద్రియాదివిధులు, విష్ణురూపంబు లెఱుఁగుము విప్రముఖ్య.[2]

353


వ.

మఱియు ఋగ్యజుస్సామాధర్వణవేదంబులును వేదాంతరహస్యంబులును నీతి
శాస్త్రంబులును మన్వాదిగ్రథితంబు లైనధర్మశాస్త్రంబులును పురాణాఖ్యానం
బులును అనువాకంబులును కావ్యాలాపంబులును సంగీతాదివిద్యలును మూర్తా
మూర్తంబులును పురుషోత్తమునిమూర్తిభేదంబులై చెల్లునని పలికి మఱియును.[3]

354


ఉ.

ఇముల వైష్ణవవ్రతము లెంతయు భక్తి నొనర్చి ద్వాదశా
బ్దమ్ములు గార్తికంబున ముదంబునఁ బుష్కరిణీపవిత్రతో
యమ్ములఁ దీర్థమాడినమహాఫలము ల్సమకూఱు నీపురా
ణమును నిచ్చరిత్రము వినంగలపుణ్యులకున్ మునీశ్వరా.

355


వ.

అనిన సంతోషపరిపూర్ణహృదయుండై మైత్రేయుం డిట్లనియె.

356


ఉ.

భూనుతకీర్తియాదిమనుపుత్రకులందుఁ బ్రసిద్దు లైనయు
త్తానపదాన్వయక్రమముఁ దప్పక చెప్పితి వాప్రియవ్రతా

  1. వైశ్రవణుండు = కుబేరుఁడు, వాసవుండు = ఇంద్రుఁడు, వనస్పతులకున్ = వృక్షములకు.
  2. పంకజాతభవాండము = బ్రహ్మాండము, సరిత్సాగరపర్వతములు = ఏళ్లు సముద్రములు కొండలు.
  3. గ్రథితములు = కూర్పఁబడినవి - రచితములు.