పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూతసంతాపనుండును మహానాగుండును మహాభాగుండును కాలనాభుండును
నన నార్వురు పుట్టిరి. కశ్యపునిమూఁడవభార్య యైనవసు వనుదానికి వైశ్వాన
రుండును ద్విమూర్ధుండును శంకుండును శంకుశిరుండును అయోముఖుండును
కపిలుండును శంబరుండును ఏకచక్రుండును దారకుండును దుర్వాహుండును
వృషపర్వుండును పులోముండును విప్రచిత్తియు ననుదానవులు పదుమువ్వురు
పుట్టి. రందు.

334


తే.

దానవజ్యేష్ఠుఁ డైనవైశ్వానరునకు, ననఘ కాలకపౌలోమ లనఁగఁ గన్య
లిరువు రుదయించి మించి రయ్యిందువదన, లను మరీచి వరించె నాలలనలకును.

335


వ.

కాలకేయపౌలోము లన నఱువదివేవురు పుట్టరి. విక్రచిత్తి యనువానికి సింహిక
యందుఁ దంతుండును శల్యుండును సభుండును వాతాపియు నిల్వలుండును
సముచియు ఖసృముండును నంధకుండును నరకుండును కాలనాభుండును
స్వర్భానుండును వక్రయోధియు ననం బుట్టిరి. మఱియుఁ దార యనుదానికి
శుకియును శ్వేనియు భాసియు సుగ్రీవియు శుచియు గృధయు నన
నార్వురు పుట్టరి. అందు శుకికి శుకంబులు పుట్టె. శ్యేనికి శ్యేనకపోతంబులు పుట్టె.
శుచికి జలపక్షులు పుట్టె. సుగ్రీవికి నశ్వోష్ట్రగార్దభంబులు పుట్టె.[1]

336


క.

వినత కనూరుఁడు గరుడుఁడు, జనియించిరి వారిలోన సర్పాశనుఁడై
పెనుపొందెను దార్క్ష్యుఁడు మఱి, వనరుహనాభునకు నతఁడు వాహన మయ్యెన్.[2]

337


క.

సురసకుఁ గశ్యపునకు ఖే, చరులు భయంకరులు సర్వసత్తము లుదయిం
చిరి వేవురు బహువదనులు, నురుదీర్ఘశరీరులును విషోల్బణయుతులై.[3]

338


తే.

కద్రువకు శేషవాసుకికాలనాభ, శంఖపద్మమహాభోగశంబతక్ష
కాదులై వేవు రుదయించి రందఱును సు, పర్ణునికి వశులైరి దృక్కర్ణపతులు.[4]

339


వ.

 మఱియుఁ గ్రోధవశ యనుదానికిఁ గ్రోధమూర్తులై దంష్ట్రాసమేతంబు లయిన
క్రూరజంతుజాలంబులు పుట్టె. సురభి యనుదానికి గోమహిష్యాదులు పుట్టె. ఇల
యనుదానికి యక్షరాక్షసులు పుట్టిరి. ముని యనుదానికి నప్సరోగణంబులు పుట్టె.
అరిష్ట యనుదానికి గంధర్వులు పుట్టిరి.

340


తే.

ఇట్లు కశ్యపవంశ మనేకశతస, హస్రసంఖ్యలఁ బుత్రపౌత్రాంతరముగ
వెలసె జంగమస్థావరంబులు జగంబు, లందుఁ బరిపూర్ణమై మించె ననఘచరిత.

341


క.

శాంతినిధి యైనలక్ష్మీ, కాంతుని రాజసగుణప్రకల్పిత మిది తా
నింతయు స్వారోచిషమ, న్వంతరసర్గంబు మునిగణాధిప వినుమా.[5]

342
  1. శ్యేనకపోతంబులు = డేగలు పావురములు.
  2. సర్పాశనుఁడు = పాములను భక్షించువాఁడు, తార్క్ష్యుఁడు = గరుత్మంతుఁడు, వనరుహనాభునకున్ = విష్ణువునకు.
  3. విషోల్బణయుతులై = విషముయొక్క పొంగుటతో కూడుకొన్నవారై.
  4. వేవురు =వేగురు - వేయిమంది, సుపర్ణునికిన్ = గరుత్మంతునికి, దృక్కర్ణపతులు = సర్పరాజులు.
  5. శాంతినిధి = ఓర్పునకు స్థాన మైనవాఁడు, ప్రకల్పితము = కల్పించఁబడినది, ఇంతయు = ఈసమస్తమును, సర్గంబు = సృష్టి.